విఘ్నేశ్‌-న‌య‌న్ స్వీట్ హ‌గ్‌, కౌగిలింతలో మైమరచిపోయిన జంట, వైరల్ అవుతున్న ఫోటో

First Published Jul 3, 2022, 8:17 PM IST

రీసెంట్ గా పెళ్ళి బంధంతో ఒక్కటయ్యారు నయనతార, విఘ్నేష్ శివన్. పెళ్ళి అయ్యే అవ్వడం..వెంటనే హనీమూన్ ట్రిప్ కు  కూడా వెళ్ళారు స్టార్ కపుల్. ఇక ఇప్పుడు ఆ హనీమూన్ స్వీట్ మెమోరీస్ ను గుర్తుచేసుకుంటున్నారు. 
 

సౌత్ లేడీ సూపర్ స్టార్  న‌య‌న‌తార  కోలీవుడ్ యంగ్  డైరెక్ట‌ర్ విఘ్నేశ్ శివ‌న్ రీసెంట్‌గా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దాదాపు 5 ఏళ్ళకు పైగా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట. మహాబలేశ్వర్ లోని ఓ స్టార్ హోటల్ లో చాలా తక్కువ మంది అతిథుల మధ్య.. పెళ్ళి చేసుకున్నారు.   వెంటనే   థాయ్‌లాండ్  హ‌నీమూన్ ట్రిప్‌కు వెళ్ళి... ఫుల్ ఎంజాయ్ చేశారు ఇద్దరు. 

Image: Vignesh ShivanInstagram

హనీ మూన్ ట్రిప్ తరువాత ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా తాము కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేయడానికి రెడీ అయిపోయారు ఇద్దరు. ప్రొఫెష‌న‌ల్ కమిట్ మెంట్స్ తో బిజీ అయిపోయింది న‌య‌నతార‌. తన నెక్ట్స్ సినిమాల కథలను రెడీ చేసుకోవడంలో విష్నేష్ కూడా బిజీ అయిపోయాడు. 

ఇక తాజాగా త‌మ హ‌నీమూన్ ట్రిప్‌లోని స్వీట్ మెమోరీస్ ను  గుర్తు చేసుకుంటూ విఘ్నేశ్ శివ‌న్ ఓ త్రో బ్యాక్ స్టిల్‌ను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ స్టిల్ లో ఇద్దరు తారలు న‌య‌న్‌-విఘ్నేశ్ ఒక‌రినొక‌రు ఆప్యాయంగా హ‌గ్ చేసుకున్న స్టిల్‌ను షేర్ చేస్తూ..దీన్ని నా బ‌ర్త్ డేగా చేసుకోండి..అని క్యాప్ష‌న్ ఇచ్చాడు.

ఇద్దరు ఒకరినొకరు మైమరిపోయి హగ్ చేసుకున్న స్టిల్ నెట్టింట్లో వైరల్  అవుతోంది. ఇక సినిమాల విష‌యానికొస్తే..న‌య‌న‌తార ప్ర‌స్తుతం బాలీవుడ్ బాద్ షా  షారుక్ ఖాన్‌ జంటగా.. సౌత్ స్టార్ డైరెక్ట‌ర్ ఆట్లీ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న జ‌వాన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 
 

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈసినిమాలో షారుక్  డ్యూయల్ రోల్ చేస్తుండగా.. అందులో న‌య‌న్ తార వ‌న్ ఆఫ్ ది హీరోయిన్‌గా న‌టిస్తోంది. మ‌రో ఫీమేల్ లీడ్ రోల్‌లో దీపికా ప‌దుకొనే క‌నిపించ‌నున్న‌ట్టు బీటౌన్ స‌ర్కిల్ టాక్‌ గట్టిగా నడుస్తోంది. 

ఇక విఘ్నేష్ శివన్ విషయానికి వస్తే... ఈ ఇయర్ లో  కాతువాల‌కు రెండు కాధ‌ల్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించాడు విఘ్నేశ్ శివ‌న్‌. ఈ సినిమా సక్సెన్ ను ఎంజాయ్ చేశాడు. ఇక  నెక్ట్స్ స్టార్ హీరో అజిత్ తో ఏకే 62 మూవీని చేయ‌బోతున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై త్వ‌ర‌లో క్లారిటీ రానుంది.

click me!