NBK: బాలయ్య నయా లుక్‌ అదిరింది.. అల్లరి నరేష్‌తో సెట్‌లో రచ్చ.. ఫోటోలు వైరల్‌

Published : Jul 03, 2022, 07:30 PM ISTUpdated : Jul 03, 2022, 10:15 PM IST

బాలకృష్ణ కనిపిస్తే ఫ్యాన్స్ కి పండగే. తాజాగా ఆయన సినిమాలోని మరో లుక్‌ బయటకు వచ్చింది. అల్లరి నరేష్‌తో కలిసి సెట్‌లో దిగిన ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.   

PREV
17
NBK: బాలయ్య నయా లుక్‌ అదిరింది.. అల్లరి నరేష్‌తో సెట్‌లో రచ్చ.. ఫోటోలు వైరల్‌

బాలకృష్ణ(Balakrishna), అల్లరి నరేష్‌(Allari Naresh) ఒకేచోట కలవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. మాస్‌కి, యాక్షన్‌కి కేరాఫ్‌గా నిలిచే బాలయ్య, కామెడీకి కేరాఫ్‌గా నిలిచే అల్లరి నరేష్‌ కాంబినేషన్‌, ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు కనిపించడం కొత్తగా ఉంది. ఇదొక కొత్త ఎక్స్ పీరియెన్స్ నిస్తుంది. 

27

తాజాగా అల్లరి నరేష్‌.. బాలయ్య సెట్‌లో సందడి చేశారు. తన `ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం`(Itlu Maredumilli Prajaneekam) యూనిట్‌ సందడి చేసింది. బాలకృష్ణ ప్రస్తుతం `NBK107` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శృతి హాసన్‌ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

37

ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంటుంది. నగర శివారులో వేసిన ఓ ప్రత్యేక సెట్‌లో షూటింగ్‌ చేస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో సడెన్‌గా అల్లరి నరేష్‌ టీమ్‌ బాలయ్యకి సెట్‌కి వచ్చారు. అయితే బాలయ్య సినిమా సెట్‌కి పక్కనే అల్లరి నరేష్‌ నటిస్తున్న `ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం` సినిమా షూటింగ్‌ జరుగుతుంది. 

47

దీంతో సండే స్పెషల్‌గా సరదాగా బాలయ్యని కలవాలనుకున్నారు అల్లరి నరేష్‌ టీమ్‌. తనతోపాటు కమేడియన్‌ ప్రవీణ్‌,ఇతర ఆర్టిస్టులు, టెక్నిషియన్లతో కలిసి అల్లరి నరేష్‌.. బాలయ్య `ఎన్బీకే 107` సెట్‌కి వెళ్లారు. ఈ సందర్భంగా కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకున్నాడు. ఇందులో బాలయ్య చేసిన ఫన్ కి నవ్వులు పూయించారు. 

57

తాజాగా దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. బాలయ్య సరదాగా మెలిగిన తీరు ఆకట్టుకుంటుంది. అదే సమయంలో ఇందులో ఆయన లుక్‌ ఆకట్టుకుంటుంది. నయా లుక్‌లో అదరగొడుతున్నారు బాలయ్య. 

67

బాలకృష్ణ ఫస్ట్ లుక్‌లో తన ఏజ్‌కి తగ్గ పాత్రలో కనిపించారు. పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపించారు. ఆ లుక్‌, అలాగే ఇటీవల విడుదలైన గ్లింప్స్ వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు లేటెస్ట్ లుక్‌లో కాస్త యంగ్‌గాఉన్నారు బాలయ్య. ఆయన నయా లుక్‌ అదిరిపోయేలా ఉంది. చూస్తుంటే `సమరసింహారెడ్డి`, `నరసింహనాయుడు` టైమ్‌లోని లుక్‌ని తలపిస్తుండటం విశేషం. కాకపోతే ఇందులో గెడ్డంతో ఉన్నారంతే. ప్రస్తుతం బాలయ్య, అల్లరి నరేష్‌ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 
 

77

 అల్లరి నరేష్‌ నటిస్తున్న `ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం` చిత్రానికి ఏఆర్‌ మోహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంది హీరోయిన్‌గా నటిస్తుంది. అటవి ప్రాంతంలోని ప్రజల సమస్యలను వెలికితీసే కథతో ఈ సినిమా రూపొందుతుందని ఇటీల విడుదలైన టీజర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. అటవి ప్రజల కోసం పోరాడే వ్యక్తి పాత్రలో అల్లరి నరేష్‌ కనిపించనున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories