స్టార్ కపుల్ నయనతార, విగ్నేష్ శివన్ వివాహం జూన్ లో వైభవంగా జరిగింది. సౌత్ లో అగ్ర నటిగా వెలుగొందుతున్న నయనతార, దర్శకుడిగా రాణిస్తున్న విగ్నేష్ ఏడేళ్లుగా సహజీవనం చేశారు. ఎట్టకేలకు దంపతులుగా ఒక్కటయ్యారు. హిందూ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహ వేడుక మహాబలిపురంలో అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహానికి చిత్ర పరిశ్రమ నుంచి అతిరథమహారధులు హాజరయ్యారు.