ఎన్టీఆర్‌ చెప్పిన జోస్యమే నిజమైంది.. నయనతారకి కవలల మ్యాటర్‌ హాట్‌ టాపిక్‌..

Published : Oct 10, 2022, 09:37 AM ISTUpdated : Oct 10, 2022, 10:40 AM IST

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, విఘ్నేష్‌ శివన్‌ పండంటి కవలలకు జన్మనిచ్చాడు. ఆదివారం ఈ విషయాన్ని విఘ్నేష్‌ ప్రకటించారు. దీంతో అంతా అభినందనలు తెలియజేస్తున్నారు. అదే సమయంలో వారిపై మీమ్స్ వైరల్‌ అవుతున్నాయి. సెటైర్లు పేలుతున్నాయి. 

PREV
17
ఎన్టీఆర్‌ చెప్పిన జోస్యమే నిజమైంది.. నయనతారకి కవలల మ్యాటర్‌ హాట్‌ టాపిక్‌..

నయనతార, విఘ్నేష్‌ శివన గత కొన్నేళ్లుగా ప్రేమించుకుని ఈ ఏడాది జూన్‌లో మ్యారేజ్‌ చేసుకున్న విషయం తెలిసిందే. అత్యంత గ్రాండ్‌గా వీరి వివాహం జరిగింది. సినీ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు. వీరి మ్యారేజ్‌ జరిగి నాలుగు నెలలు కూడా పూర్తి కాలేదు. అప్పుడే వీరు తల్లిదండ్రులు అయ్యారు. 
 

27

తమకి కవల మగ పిల్లలు పుట్టినట్టు దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా తన చిన్నారుల పాదాలను ముద్దాడుతూ దిగిన ఫోటోలను పంచుకున్నారు. తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే వీరికి సడెన్‌గా పిల్లలు ఎలా పుట్టారనేది హాట్‌ టాపిక్‌ అయ్యింది. మ్యారేజ్‌ అయింది నాలుగు నెలలే. పైగా నయనతార ఎప్పుడూ గర్భంతోనూ కనిపించలేదు. మరీ ఈ ట్విన్స్ ఎలా వచ్చారని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. 

37

అయితే సరోగసి(అద్దె గర్భం) ద్వారా సెలబ్రిటీలు పిల్లలకు జన్మనిస్తున్న విషయం తెలిసిందే. చాలా మంది సినీ తారలు ఇలా పిల్లలను పొందుతున్నారు. ఇప్పుడు నయనతార, విఘ్నేష్‌ జంట కూడా సరోగసి ద్వారానే పిల్లలకు జన్మనిచ్చినట్టు తెలుస్తుంది. ఇంత వరకు బాగానే ఉంది. ఇప్పుడిది హాట్‌ టాపిక్‌ గా మారడంతోపాటు సోషల్‌ మీడియాలో రచ్చ లేపుతుంది. అనేక రకాల మీమ్స్ వైరల్‌ అవుతున్నాయి. 

47

ఇదిలా ఉంటే ఒకప్పుడు ఎన్టీఆర్‌ చెప్పిందే నిజమైందని అంటున్నారు నెటిజన్లు. ఎన్టీఆర్‌ చెప్పిన జోస్యం నిజమైందని, నయనతారకి నడుముపై పుట్టుమచ్చ ఉందని, అది ఉంటే కవలలు పుడతారని తారక్‌ నయనతారకి అప్పుడే చెప్పాడు. ఇప్పుడు అదే నిజమైంది. దీంతో ఎన్టీఆర్‌ చెప్పిన జోస్యం నిజమైందని అంటున్నారు. ఈ మేరకు ప్రూప్‌ కూడా చూపిస్తూ వైరల్‌ చేస్తున్నారు. 

57

ఎన్టీఆర్‌, నయనతార కలిసి `అదుర్స్` చిత్రంలో నటించారు. వివి వినాయక్‌ దర్శకుడు. ఈ చిత్రంలో తారక ద్విపాత్రాభినయం చేశారు. ఓ పాత్రలో ఆయన పూజారిగా నటించారు. అందులో భాగంగా స్విమ్మింగ్‌ పూల్‌లో బికినీ స్విమ్‌ చేస్తున్న నయనతారని చూసిన ఎన్టీఆర్‌ ఫిదా అయిపోతాడు. అంతేకాదు ఆమె నడుముపై పుట్టుమచ్చని చూసి మీకు కవలలు పుడతారని, మచ్చ శాస్త్రం అదే చెబుతుందని తెలిపారు. అప్పుడు ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగ్‌ ఇప్పుడు నిజమైందని, దానితో లింక్‌ చేస్తున్నారు మీమర్స్. వైరల్‌ చేస్తున్నారు. 
 

67

మరోవైపు అదే సినిమాలో బ్రహ్మానందం ఇద్దరు కవల పిల్లలో కనిపించే సీన్‌ ఉంటుంది. అందులో ఎన్టీఆర్‌కి గురువుగా బ్రహ్మానందం చేసిన విషయం తెలిసిందే. నయనతారపై మోజుపడతాడు బ్రహ్మానందం. దాన్ని బేస్‌ చేసుకుని ఈ మీమ్స్ క్రియేట్‌ చేయడం విశేషం. దీంతో ఇది కూడా ట్రెండింగ్‌లో ఉంది. ఇలా నయనతారకి ట్విన్స్ పుట్టడానికి సంబంధించి సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు ట్రోలర్స్. 
 

77

నయనతార చివరగా `గాడ్‌ ఫాదర్‌` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా దసరా కానుకగా విడుదలై మిశ్రమ స్పందనతో దూసుకుపోతుంది. కలెక్షన్లు ఫర్వాలేదని తెలుస్తుంది. ఈ సినిమా విజయంపై నయనతార కూడా స్పందించింది. ఓ నోట్‌ విడుదల చేసి ఆడియెన్స్ కి, చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం ఆమె హిందీలో `జవాన్‌` చిత్రంలో నటిస్తుంది. తమిళంలో `కనెక్ట్`, `ఇరైవన్‌`, మలయాళంలో `గోల్డ్` చిత్రాల్లో నటిస్తుంది నయనతార. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories