Karthika Deepam: జాతరలో దీపను వెతకడానికి వచ్చిన శౌర్య.. మోనిత నిజస్వరూపం తెలుసుకున్న కార్తీక్?

First Published Oct 10, 2022, 8:34 AM IST

Karthika deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు అక్టోబర్ 10వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..రాజ్యలక్ష్మి ఊరు వాళ్లతో మైక్ పట్టుకుని, అందరికీ స్వాగతం. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బతుకమ్మ పండుగలు ఘనంగా జరగబోతున్నాయి. బతుకమ్మ ఆడి నిమర్జనం అయ్యేంతవరకు అందరూ ఉండి పాలుపంచుకోవాలని కోరుకుంటున్నాము. బతుకమ్మ పండుగ మొదలవుతుంది అందరూ త్వరగా రండి అని ఆనందంగా చెప్తుంది. ఆ తర్వాత సీన్ లో దీప బతుకమ్మని అలంకరించి, అమ్మ నీ పేరు బతుకమ్మ. అలాగే నా బతుకు కూడా చల్లగా ఉండాలని దీవించు అని కోరుకుంటుంది. అప్పుడు దీప వాళ్ళ అమ్మ, ఆ బతుకమ్మ దీవెనలు, రాజ్యలక్ష్మి తోడు నీకు ఉన్నంతవరకు ఎప్పుడూ మంచే జరుగుతుంది అని అంటుంది. మరోవైపు కావేరి, మోనిత బతుకమ్మను అలంకరించి పట్టుకొని నడుస్తూ ఉన్నప్పుడు కావేరి మోనిత తో, ఎప్పుడైతే మనం ఊర్లో వాళ్ళ చేత దీపను తిట్టించామో అప్పటినుంచి దీప మనకు కనిపించడం లేదు,భయపడినట్టు ఉంది అని అనగా, అది అంత తేలిక కాదు కావేరి. 

కిందటిసారి అన్నప్పుడు భయపడింది ఈసారి దాని ముఖంలో తెలియని ధీమా కనిపిస్తుంది. నాకెందుకో భయంగా ఉంది అని అంటుంది. దానికి కావేరి, నువ్వు భయపడొద్దు మోనిత. ఒకవేళ ఇందాక ఇచ్చింది సరిపోలేదనుకో ఇంకో పదిమందిని తీసుకొచ్చి తిట్టిపిద్దాము అని అంటుంది. ఆ తర్వాత సీన్లో సౌర్య, వాళ్ళ పిన్ని బాబాయ్ లతో, ఆటోలో వస్తూ ఉండగా హోటల్లో దీపను చూసిన విషయం గుర్తొచ్చి, బాబాయ్ ఆటో ఆపు అని ఆటో ఆగిపిస్తుంది.తర్వాత బయటకు వచ్చి, నువ్వు ఇందాక వెళ్లి పలకరించింది ఎవరిని బాబాయ్ అని అనగా, అప్పుడు మనకి సరుకుల లిస్టు రాశారు కదా ఆవిడే అని ఇంద్రుడు అంటాడు. దానికి సౌర్య, ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు బాబాయ్.ఆరోజు అమ్మ చేతిరాతలాగే అనిపించింది, అమ్మ గొంతులాగే అనిపించింది.ఈరోజు చూసేసరికి అమ్మలాగే అనిపించింది అని అనగా చంద్రమ్మా, మరి వాళ్ళ దహన సంస్కారాలు మీ ఆంటీ చేశారు అని చెప్పావు కదా అమ్మ? ఒకవేళ మీ అమ్మే అయితే కిందటిసారి ఫోన్లో మాట్లాడినప్పుడు నీ గొంతు గుర్తుపట్టేది కదా అని అడగగా, అప్పుడు నాకు జలుబు చేసింది పిన్ని. అందుకే అమ్మ నా గొంతు గుర్తుపట్టలేనట్టు ఉన్నది.తను అమ్మ అయినా, కాకపోయినా ఒకసారి మొఖం చూస్తే నా అనుమానం తీరిపోతుంది కదా అని బాధపడుతూ, ఇప్పుడు జాతరకు వెళ్తున్నాం కదా అక్కడ ఎలాగైనా ఆవిడని చూద్దాము అని అంటుంది.
 

తర్వాత ముగ్గురు ఆటో ఎక్కి పయనం కొనసాగిస్తారు. ఆ తర్వాత సీన్లో దుర్గ కూడా ఆ గ్రామానికి చేరుకుంటారు. అప్పుడు దీప వాళ్ళ అన్నయ్య దుర్గకు కనిపిస్తాడు. రా దుర్గా, దీప నీకోసమే ఎదురుచూస్తుంది. బతుకమ్మ దగ్గర ఉన్నది అని అనగా, లేదు సార్ నాకు ఇంకో పంచాయతీ ఉన్నది. మోనిత వాళ్లు కూడా ఇక్కడే ఉన్నారట కదా నేను వెళ్లి వాళ్ళని గెలుకుతాను అని అంటాడు. అప్పుడు దీప వాళ్ళ అన్నయ్య, జాగ్రత్త అని అంటాడు. మరోవైపు కార్తీక్, మోనిత ఇద్దరూ నడుస్తూ ఉండగా, ఎందుకు కార్తీక్ అలాగున్నావు అని మోనిత అంటుంది. ఇక్కడ చుట్టూ ఎన్ని మంది ఉన్నా ఎవరు నా వాళ్ళు కాదు. నేను ఒంటరి వాడిని అనిపిస్తుంది అని అనగా, అలా ఏమీ అనుకోవద్దు కార్తీక్ వీళ్లంతా మనవాళ్లే చూడు నిన్ను ఎలా పలకరిస్తున్నారో అని మోనిత,కార్తీక్ చేయ పట్టుకుని నడుస్తూ ఉంటుంది.ఇంతలో దుర్గ అక్కడికి వచ్చి ఆగుతాడు. దుర్గని చూసిన కార్తీక్,మోనిత చేతిని తన చేతి మీద నుంచి తీసేస్తాడు.అప్పుడు మోనిత మనసులో, వీడు ఇక్కడికి కూడా వచ్చేసాడా అని అనుకుంటుంది.అప్పుడు దుర్గ, ఏంటి మోనిత కలిసి రమ్మన్నావు నన్ను తీసుకు వెళ్లకుండానే వచ్చేసావు. బండిలో ఇంత దూరం వచ్చాను. 

మన తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడానికి ఈ ఊరుకి రమ్మన్నావు కదా అని అనగా కార్తీక్, ఓహో అలా అన్నదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మోనిత కార్తీక్ చేయి పట్టుకుని,నువ్వు ఆగు కార్తీక్. అయినా నేను నిన్ను పిలవలేదు కదా దుర్గ. ఇది నీవూరా? అని అడగగా, మరి నీవూరా? అయినా ఇది నీ ఊరైనప్పుడు నా ఊరు కూడా ఇదే కదా అని దుర్గా అంటాడు. ఇంతలో ఒకడు దుర్గ దగ్గరికి వచ్చి, ఏం దుర్గ ఇదేరాడమా? చాలా రోజులైంది కనిపించి, సాయంత్రం వెళుతున్నప్పుడు ఇంటికి వచ్చి వెళ్ళు అని అంటాడు. తను వెళ్ళిపోయిన తర్వాత దుర్గ మోనితతో, చూసావా మోనిత ఇది నా పుట్టిన ఊరు. కార్తీక్ సార్ ఏదో అనుకుంటారని నా ఊరిని నేను మార్చుకోలేను కదా అని అంటాడు. ఇంతలో ఇంకొకళ్ళు వచ్చి, ఏం దుర్గ వచ్చావా. ఇందాక మోనితని చూసి ఒక్కతే వచ్చింది నువ్వు రాలేదు అని అనుకున్నాను. ఎంతైనా అప్పట్లో మీరిద్దరూ ఎప్పుడూ కలిసి తిరిగేవారు కదా సరే ఇంక నేను వెళ్తాను అని వెళ్తాడు. అప్పుడు కార్తీక్ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మోనిత దుర్గతో, ఇది మీ ఊరు ఏంట్రా? ఎవర్రా నిన్ను పిలిచారు?ఏంటి ఈ సెటప్ అని అనగా, ఇలాగే ఉరి జనాలతో దీపమ్మని కూడా అవమానించేలా చేశావు కదా, ఇప్పుడు అర్థమైందా ఆ బాధ.
 

అందుకే ఇలాంటి నొప్పి ఏది రాకూడదంటే వెళ్లి కార్తీక్ సార్ తో,నువ్వు ఆయన భార్యవి కాదు దీపే తన భార్య అని చెప్పు అని అనగా, నేనెందుకు చెప్పాలి రా! నా నోట్లో నుంచి ఆ మాట రాదు. దీపకి కార్తీక్ కి సంబంధం లేదు నేనే కార్తీక్ భార్యని అని మోనిత అంటుంది. అప్పుడు దుర్గ, ఇంతవరకు నీకు అవకాశం ఇచ్చాను, నీ తప్పు నువ్వే సరిదిద్దుకుంటావు అని అనుకున్నాను. కానీ నువ్వు ఇంక మారవు అని నాకు అర్థమైంది. ఇంక నేను చేయాల్సింది చేస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మోనిత మనసులో, వీడన్న మాటలకి కార్తీక్ ఎలా ఫీల్ అయ్యి ఉంటాడో ఎక్కడికి వెళ్ళాడో అని కార్తీక్ ని వెతుకుతూ ఉంటుంది. మరోవైపు కార్తీక్, దుర్గ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో శివ అక్కడికి వస్తాడు.నువ్వేంటయ్యా ఇక్కడ అని కార్తీక్ అనగా, మేడం ఫోన్ చేసి రమ్మన్నారు సార్. ఈ రోజు మీ పుట్టిన రోజు అట కదా నాకు తెలీదు. తెలిసుంటే పార్టీ ఇచ్చే వాడిని అని అనగా, నా పుట్టినరోజు మీ మేడంకే గుర్తులేదు. ఇంకా నీకెలా తెలుస్తుందిలే ఆదిత్య అని కార్తీక్ అంటాడు. అప్పుడు గతంలో ఆదిత్యతో కార్తీక్ కి జరిగిన సంభాషణలు అన్ని అస్పష్టమైన దృశ్యాలతో కార్తీక్ కి కనిపిస్తాయి. ఇప్పుడు నేను ఏమన్నాను అని కార్తీక్ అనగా, మీరు ఎప్పుడూ నా పేరు మర్చిపోతారు కదా సరే లే నా పేరు శివ అని శివ అంటాడు. 

ఇప్పుడు కార్తీక్ నేను ఏ పేరుతో పిలిచాను చెప్పవయ్యా అని అనగా, ఆదిత్య అని అన్నారు సార్ అని శివ అంటాడు. ఈ పేరు వినగానే నాకు ఎందుకో ఒక బోర్డ్ లాంటిది కనిపిస్తుంది. ఈ పేరుకి నాకు ఏదో సంబంధం ఉంది. ఎప్పుడైనా మీ మేడం మీ పేరుని చెప్పడం విన్నావా అని అనగా, లేదు సర్ అని శివ అంటాడు. అదే సమయంలో శౌర్య వాళ్ళు కూడా ఆ జాతర దగ్గర దిగుతారు. మరోవైపు శివ కార్తీక్ తో, మీరు ఎక్కువ ఆలోచించొద్దు సర్. మీ ప్రాణానికి ప్రమాదం కదా బలవంతంగా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించదు అని అనగా, కార్తీక్ చిరాకు పడి ఎవరయ్యా బలవంతంగా గుర్తు తెచ్చుకుంటున్నారు. మీ మేడమే అలాంటిది అనుకుంటే, నువ్వు కూడా ఇలాగే తయారవుతున్నావు. నేనేం మాట్లాడినా దానికి సంబంధించిన ఏదో ఒకటి నాకు గుర్తొస్తుంది. కానీ ఏది పూర్తిగా గుర్తు రావడం లేదు.అడిగితే మీ మేడం నాకేమీ చెప్పడం లేదు నాకు పిచ్చెక్కుతుంది అని కార్తీక్ అంటాడు. ఇటువైపు శౌర్య, వాళ్ళ పిన్ని బాబాయ్ లతో, దీపను వెతుకుతూ ఉంటుంది. అప్పుడు ఇంద్రుడు, అక్కడ బతుకమ్మ ఆడుతున్న మహిళలను చూపిస్తూ, ఈ జాతరకి వచ్చిన ఎవరైనా బతుకమ్మను తీసుకొని ఇక్కడికి రావాల్సిందే కనుక అక్కడికి వెళ్లి చూద్దాము అని వెళ్తారు.

 ఆ తర్వాత సీన్లో అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ బతుకమ్మని పెట్టడానికి ఒక చోటికి వస్తారు అప్పుడే రాజ్యలక్ష్మి ఇంట్లో నుంచి దీపు బయటకు వస్తుంది. దీప ను చూసిన మోనిత కావేరితో, దీప వస్తుంది అని చెప్పగా, కావేరీ రానీ, మనకు కూడా అదే కావాలి కదా.ఇప్పుడు చెప్డాం దీని పని అని అనుకుంటారు. ఇంతలో దీపా బతుకమ్మని అక్కడ పెట్టి అక్కడ నుంచి పక్కకు వెళుతుంది. ఎందుకమ్మా ఇటువైపు వచ్చావు అని వాళ్ళ అమ్మ అనగా,తెలియదు అమ్మ డాక్టర్ బాబు గురించి ఆలోచనలు వస్తున్నాయి అని దీప అంటుంది. ఇటువైపు కావేరి,మోనితతో కార్తీక్ ముందు దాని పరువు తీసాం కదా ఇప్పుడు రాజ్యలక్ష్మి గారి ముందు కూడా తనని చెడ్డ చేస్తే ఇంక ఇటు వైపు రాదు అని అంటుంది. అప్పుడు కావేరి రాజ్యలక్ష్మి దగ్గరికి వెళ్లి, అమ్మ ఆవిడ అంత మంచి ఆవిడ కాదు టక్కులాడి. మోనిత భర్త వెనుక పడుతుంది అని అనగా, రాజ్యలక్ష్మి దీపను చూపిస్తూ, తన గురించేనా నువ్వు మాట్లాడేది అని అంటుంది. అవును అని కావేరి అనగా, తను మంచిది తన గురించి నాకు తెలుసు. మా చెల్లెలు కొడుకు తనని సొంత చెల్లిలా చూసుకుంటాడు. అయినా మిమ్మల్ని ఈ ఊర్లో నేను ఎక్కడా చూడలేదే,తినని చూడలేదు, దీపని చూడలేదు అని అనగా కావేరి, మీరు ఈ ఊరిలో ఉండరు కదా పెద్దమ్మ అందుకే మీకు తెలియలేదు అని అంటుంది.దానికి రాజ్యలక్ష్మి కోపంతో, నేను ఈ ఊరిలో లేకపోయినా ఈ ఊర్లో జరిగే ప్రతి విషయం నాకు తెలుసు. 

ఇది నా పుట్టిన ఊరు అని అనగా, మోనిత, మేము చెప్పేది వినండి అని అంటుంది. దానికి రాజ్యలక్ష్మి, పండగ అయిన తర్వాత మాట్లాడదాము అనుకున్నాను కానీ మీరే ప్రస్తావన తెచ్చారు కనుక చెప్తున్నాను వినండి, నువ్వేం చెప్తావో నాకు తెలుసు.నాకు నువ్వు తెలీదు,తను తెలీదు అయినా తను మంచిదే అని ఎందుకు అంటున్నాను అంటే కథ అంతా నువ్వే అల్లావు. అంటే తప్పు నీవైపే ఉన్నట్టు లెక్క. నలుగురు మనుషుల్ని కొని సొంత ఊరు ఉన్నదని తనని అందరి ముందు చెడ్డ చేయడానికి నాటకం ఆడావు. ఇంక ఆపు అని చెప్పి మోనితని తిడుతుంది రాజ్యలక్ష్మి. అప్పుడు మోనిత మనసులో, ఏదో చేద్దాం అనుకుంటే ఇలాగైందేంటి! మంచిదైంది కార్తీక్ ఇక్కడ లేడు లేకపోతే నా పని అయిపోయేది అని వెనక్కి తిరిగి చూసేసరికి కార్తీక్ ఆ మాటలన్నీ వింటాడు. అప్పుడు కార్తీక్ మనసులో, అంటే ఇది మా సొంతూరు కాదా! దీపను చెడు చేయాలని మోనిత ఈ ఊరిని సృష్టించిందా అని అనుకుంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!