
నయనతార స్టార్ హీరోయిన్ గా ఇప్పుడు అందరికి తెలుసు.. కాని ఈ స్టేజ్ కు రావడం కోసం ఆమె పడిన కష్టాల గురించి ఎంత మందికి తెలుసు.. అసలు నయన్ అసలు పేరు ఏంటో తెలుసా.. నయనతార అసలు పేరు డయానా మరియన్ కురియమ్. కెరీర్ బిగినింగ్ లో మనసీనక్కరే సినిమాలో నటించింది బ్యూటీ. కాని ఈమూవీ ఒకటి ఉందని ఎవరికీ తెలియదు. అయితే ఈ సినిమా దర్శకుడు డయానా అనే పేరు నచ్చక.. ఒక రోజంతా ఆలోచించి నయనతార అనే పేరు పెట్టాడు. ఆపేరే ఆమెకు కలిసి వచ్చింది. స్టార్ హీరోయిన్ అయ్యింది.
నయనతార మొదటి సినిమా ప్లాప్ అయినా.... తనకు ఈ పేరు పెట్టిన దర్శకుడిని మాత్రం మర్చిపోలేదు నయన్. అతన్ని గురువుగా భావిస్తుందట.. మలయాళీ అయిన నయనతార.. మొదటి సినిమా ప్లాప్ అవ్వడం.. అసలు వచ్చిన సంగతి కూడా ఎవరీకి తెలియక పోవడంతో.. అవకాశాలు రాక.. మలయాళంలోనే ఒక లోకల్ టీవీ ఛానల్ లో కొన్ని రోజులు యాంకర్‌గా పనిచేసింది.
ఎలాగొలా మళ్లీ.. అవకాశం సాధించింది నయన్.. శరత్ కుమార్ హీరోగా వచ్చిన అయ్యా సినిమాతో హీరోయిన్ గా తరిగి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా.. అవకాశాలు మాత్రం వెంటపడుతూ వచ్చిపడ్డాయి. ఆటైమ్ లోనే మురుగుదాస్ దర్శకత్వంలో సూర్య హీరోగా వచ్చిన గజిని సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించింది నయనతార. అక్కడి నుంచి ఆమె కెరీర్ మారిపోయింది.
అడపా దడపాసినిమాలు చేస్తున్న నయనతార కెరీర్ ను కంప్లీట్ గా మార్చిన సినిమా చంద్రముఖి. ఈసినిమాలో రజనీకాంత్ జోడిగా నటించిన తర్వాత సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయిపోయింది నయనతార. వెంటనే టాలీవుడ్ లోకూడా ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. తెలుగులో వరుసగా లక్ష్మీ, యోగి, దుబాయ్ శీను, సింహం ఇలా అన్ని హిట్ సినిమాలే చేసుకుంటూ వెళ్లింది బ్యూటీ.
అప్పటికీ ఇప్పటికే ఎంత మంది కొత్త హీరోయిన్లు వచ్చినా.. తమిళంలో నెంబర్ 1 హీరోయిన్ గా కొనసాగుతూనే ఉంది నయనతార. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన నయనతారను తమిళ పరిశ్రమ హక్కున చేర్చుకుని..స్టార్డమ్ చేతిలో పెట్టింది. 40 ఏళ్లు వచ్చినా ఇప్పటికీ నయనతార స్టార్ డమ్ లో ఏమాత్రం మార్పులేదు. అంతే కాదు అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా కూడా నయన్ కు రికార్డ్ ఉంది. ఈ ఏజ్ లో కూడా సినిమాకు 15 కోట్లు వరకూ ఆమె డిమాండ్ చేస్తోంది.
నయనతార మలయాళ క్రిష్టియన్ కుటుంబంలో పుట్టినా.. ఆమె అందరు దేవుళ్లను నమ్ముతారట. ఎక్కువగా మైథలాజికల్ క్యారెక్టర్లు కూడా చేసింది నయనతార. బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీరామ రాజ్యంలో బాలకృష్ణ రాముడిగా.. నయనతార సీతగా అలరించింది. ఈపాత్రకు ఆమె పూర్తి న్యాయం చేసింది. రీసెంట్ గా ఓ సినిమాలో ముక్కుపుడక అమ్మవారిగా నయన్ నటన అద్భుతం. ఇక మలయాళంలో జరిగే ఓనమ్ ఫెస్టివల్ ను అస్సలు మిస్ అవ్వదు నయనతార.
అంతే కాదు ఇండస్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. నయనతార. ఆమె ఒక స్టార్ హీరో ఇమేజ్ కు సమానంగా స్టార్ డమ్ ను సాధించింది. అందుకే సౌత్ లో విజయశాంతి తరువాత నయనతారను లేడీ సూపర్ స్టార్ గా పిలుస్తారు. గ్లామర్ పాత్రలతో అలరించిన నయనతార.. మరోవైపు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ కూడా అదరగొట్టింది.
నయనతార జీవితం సాఫీగా సాగిపోలేదు.. ఆమె పర్సనల్ లైఫ్ లో మాత్రం నయనతార ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఫేస్ చేసింది. హీరో శింబు తో ప్రేమలో పడింది.. అతని చేతిలోమోసపోయింది.. ఆతరువాత రెండో సారి స్టార్ కొరియోగ్రఫర్ ప్రభుదేవ ను ప్రేమించింది. పెళ్లి చేసుకుంటారు అనుకున్న టైమ్ కు.. పెద్ద వివాదంగా మారి.. ఆపెళ్లి కూడా ఆగిపోయింది. దాంతో ఆమె మానసికంగా చాలా స్ట్రగుల్ ఫేస్ చేసింది.
ఎన్నటికష్టాలు వచ్చినా..ఎదురు నిలుచుని ఫేస్ చేసింది నయనతార. తన కెరీర్ పై ఈ ప్రభావం పడకుండా జాగ్రత్త పడింది. తన స్టార్ డమ్ ను నిలుపుకుంది. దర్శకుడు విగ్నేష్ శివన్ తో దాదాపు ఐదేళ్లు డేటింగ్ చేసి గతేడాది పెళ్లి చేసుకుంది నయనతార. సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లి అయ్యింది. ప్రస్తుతం అటు సినీ జీవితం, పర్సనల్ లైఫ్ లో హ్యాపీగా లీడ్ చేస్తోంది.
ఈమధ్యే బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది నయనతార. జవాన్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యింది. ఈసినిమాలో షారుఖ్ ఖాన్ జోడీగా నటించి అక్కడ కూడా తన సత్తా చాటుకుంది. ఈమూవీ వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేయడంతో.. నయనకు అక్కడ కూడా అవకాశాలు పెరిగిపోయాయి. ఎక్కడికి వెళ్లినా.. ఏ సినిమా చేసినా.. ఎంత పెద్ద హీరో అయినా.. నయనతార మాత్రం సినిమా ప్రమోషనలలో పాల్గొనదు. ఎవరు పిలిచినా ప్రచారానికి రాదు.
ఇక సర్సనల్ లైఫ్ లో ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేసినా.. ఆమె కోట్లలో ఆస్తులను కూడ పెట్టింది. చెన్నై, హైదరాబాద్, కేరళలో ఇళ్ళు కొనడంతో పాటు.. లగ్జరీ కార్లు, ప్రైవేట్ జెట్ కూడా కొని షాక్ ఇచ్చింది. ఈరేంజ్ లో ఆస్తులు ఇంత వరకూ ఏ స్టార్ హీరోయిన్ కు లేవు. అంతే కాదు సొంతంగా బిజీనెస్ లు కూడా చేస్తోంది నయన్. మరికొన్ని కంపెనీల్లో పెట్టబడులు కూడా ఆమె పెట్టినట్టు సమాచారం. ఇలా నయనతార గురించిచెప్పుకుంటూ వెళ్తే.. లిస్ట్ చాలా పెద్దదే అవుతుంది. సో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి లేడీ సూపర్ స్టార్ నయనతారకు హ్యాపీ బర్త్ డే.