పెళ్లికాని అల్లుడు, ఉగాదికి ప్రియుడిని ఇంటికి తీసుకెళ్లిన నయనతార!

First Published Apr 12, 2021, 11:40 AM IST

సందర్భం దొరికితే చాలు సంబరాల్లో ముగినిపోతారు నయనతార, విగ్నేష్ శివన్. ఈ కోలీవుడ్ జంట దాదాపు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పండగలైనా, పుట్టినరోజు వేడుకలైనా కలిసి ఘనంగా జరుపుకుంటారు.

ఎవరి బర్త్ డే అయినా మాంచి రొమాంటిక్ ప్రదేశానికి విహారానికి చెక్కేస్తారు. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోని ఈ జంట, తమ రిలేషన్ గురించి ఓపెన్ గానే మాట్లాడుతారు.
undefined
తాజాగా మరో స్పెషల్ ట్రిప్ వేశారు నయనతార, విగ్నేష్ శివన్. ఇద్దరూ కేరళలోని నయనతార నివాసానికి వెళ్లారు. ఉగాది సెలెబ్రేషన్స్ కోసం ప్రత్యేక విమానంలో కొచ్చిన్ చేరుకున్నారు నయనతార, విగ్నేష్.
undefined
దాదాపు ఓ వారం రోజులు కేరళలో ఉగాది సంబరాలలో ముగిని తేలనున్నారట. షూటింగ్స్, మీటింగ్స్ తో బిజీ లైఫ్ కి స్వల్ప విరామం ప్రకటించి, కేరళ వెళ్లారు ఇద్దరు. పెళ్లి కాకపోయినా కొత్త అల్లుడు వలె విగ్నేష్ ని నయనతార కుటుంబం ట్రీట్ చేస్తారు.
undefined
ఆ మధ్య ఓనమ్ వేడుకలకు కూడా ఇలాగే వెళ్లడం జరిగింది. కొత్త అల్లుడుకు మాదిరి ఏమాత్రం తగ్గని మర్యాదలతో ఆతిధ్యం ఇచ్చారు.
undefined
మరోవైపు నయనతార, విగ్నేష్ నిశితార్థం కూడా జరుపుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. మరి ఇదే నిజమైతే త్వరలో వీరి పెళ్లి భాజా మోగడం ఖాయం.
undefined
గతంలో శింబు, ప్రభుదేవాలతో అఫైర్స్ నడిపిన నయనతార బ్రేక్ తరువాత విగ్నేష్ తో లాకప్ అయ్యింది. విగ్నేష్ తో అయినా ఆమె బంధం పెళ్లి తీరం చేరాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
undefined
click me!