ప్రభాస్ కంటే ముందే అనుష్కకు ఓ హీరో, టెక్నీషియన్ లతో అఫైర్ రూమర్స్.. వాళ్ళు ఎవరంటే!

First Published Apr 12, 2021, 10:22 AM IST

టాలీవుడ్ లో అనుష్క శెట్టికి ఉన్నంత గుడ్ విల్ మరో హీరోయిన్ కి లేదు. పరిశ్రమలో ప్రతి ఒక్కరు ప్రేమించే హీరోయిన్ గా అనుష్క ఉన్నారు. దాదాపు 15ఏళ్ళ కెరీర్ లో అనుష్కపై ఒక్క వివాదం కూడా తలెత్తలేదు. రెమ్యూనరేషన్స్ విషయంలో కూడా నిర్మాతల హీరోయిన్ గా ఆమె ఉన్నారు. 
 

సోషల్ మీడియాలో కూడా అనుష్క చాలా సైలెంట్. తన ఫ్యామిలీ, పరిశ్రమలో అతిదగ్గర వ్యక్తులకు సంబంధించిన విషయాలపై మాత్రమే స్పందిస్తారు. మిస్ పర్ఫెక్ట్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన అనుష్కపై మాత్రం పెళ్లి రూమర్స్ ఉన్నాయి.
undefined
ముఖ్యంగా ప్రభాస్, అనుష్క పెళ్లి మ్యాటర్ చాలా కాలంగా నడుస్తూనే ఉంది. ప్రభాస్, అనుష్కలు మా మధ్య ఏమీ లేదు, మంచి మిత్రులం మాత్రమే అని ఎన్ని సార్లు మొత్తుకున్నా... ఫ్యాన్స్, మీడియా మాత్రం నమ్మడం లేదు.  బాహుబలి సినిమా సమయంలో మొదలైన అనుష్క, ప్రభాస్ పెళ్లి రూమర్ కొనసాగుతోనే ఉంది.
undefined
సాహో మూవీ ప్రొమోషన్స్ కోసం దేశం మొత్తం చక్కర్లు కొట్టాడు ప్రభాస్. ఎక్కడికి వెళ్లినా ఆయనను వెంటాడిన ప్రశ్న మాత్రం.. అనుష్కతో పెళ్లి.  అయితే ప్రభాస్ కంటే ముందే ఓ ఇద్దరు వ్యక్తులతో అనుష్క పెళ్లి అంటూ వార్తలు రావడం విశేషం.
undefined
వారిలో ఒకరు హీరో గోపీచంద్ కాగా, మరొకరు సినిమాటోగ్రాఫర్ కె కె సెంథిల్ కుమార్.  యజ్ఞం మూవీతో హీరోగా నిలదొక్కుకున్న గోపీచంద్ లక్ష్యం మూవీతో మరో భారీ హిట్ అందుకున్నాడు. ఈ మూవీలో గోపి చంద్ కి జంటగా అనుష్క శెట్టి నటించారు. ఆ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో శౌర్యం మూవీ రాగా, అది కూడా విజయం అందుకుంది.
undefined
ఈ సమయంలో అనుష్క, గోపీచంద్ మధ్య ప్రేమ చిగురించినట్లు, పెళ్లి కూడా చేసుకోనున్నారని వరుస కథనాలు రావడం జరిగింది.
undefined
వెండితెరపై వీరిద్దరి కెమిస్ట్రీ కూడా అద్భుతంగా ఉన్న నేపథ్యంలో, ప్రేక్షకులు సైతం వీరి మధ్య సంథింగ్ సంథింగ్ అన్నారు. ఈ వ్యవహారంలో అనుష్క, గోపిచంద్ నోరుమెదపలేదు. అయితే 2013లో గోపీచంద్ శ్రీకాంత్ మేనకోడలిని వివాహం చేసుకున్నారు.
undefined
రాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రాఫర్ కె కె సెంథిల్ కుమార్ , అనుష్క ప్రేమించుకున్నారంటూ ఓ పదేళ్ల క్రితం వార్తలు వచ్చాయి. సెంథిల్ పెద్దవాళ్ళను ఒప్పింది అనుష్కను వివాహం చేసుకోవాలని అనుకున్నారట.
undefined
సెంథిల్ కుమార్, అనుష్క పెళ్లి కథనాలు అప్పట్లో రావడం జరిగింది. కారణం ఏదైనా కానీ పెళ్లి చేసుకోవాలనుకున్న వీరు నిర్ణయం మార్చుకున్నట్లు మరలా కొన్ని వార్తలు వచ్చాయి.
undefined
ఇక 2009లో రూహి అనే అమ్మాయిని సెంథిల్ కుమార్ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్ళికి హాజరై అనుష్క సందడి చేశారు.
undefined
click me!