OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతున్న మర్డర్‌ మిస్టరీ.. చివరి 10 నిమిషాల ట్విస్ట్ చూస్తే మతిపోవాల్సిందే

Published : Feb 07, 2026, 04:34 PM IST

నవీన్‌ చంద్ర ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్‌ సిరీస్‌లు, ఓటీటీ ఫిల్మ్స్ చేస్తూ రాణిస్తున్నారు. ఈక్రమంలో ఆయన నటించిన ఫిల్మ్ ఒకటి ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతుంది. 

PREV
15
ఓటీటీలో దుమ్ములేపుతున్న `బ్లైండ్‌ స్పాట్‌`

ఓటీటీలో ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమా తెగ సందడి చేస్తోంది. ఈ సినిమా పేరు `బ్లైండ్ స్పాట్`. దీనికి రాకేష్ వర్మ దర్శకుడు. నవీన్‌ చంద్ర ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా తెలుగులో ఉంది,  హిందీలో కూడా డబ్‌ అయ్యింది. ఓటీటీలో విశేష ఆదరణతో దుమ్ములేపుతుంది. 

25
89 నిమిషాల నిడివితో `బ్లైండ్‌ స్పాట్‌`

దర్శకుడు రాకేష్ వర్మ రూపొందించిన `బ్లైండ్ స్పాట్` కేవలం 89 నిమిషాల సినిమా. అయినా, ఈ 89 నిమిషాలు మిమ్మల్ని సీటు నుంచి కదలనివ్వదు. ఒక మహిళ ఆత్మహత్యతో సినిమా మొదలవుతుంది, అది తర్వాత ఒక సంక్లిష్టమైన మర్డర్ మిస్టరీగా మారుతుంది. 

35
సస్పెన్స్ తో సాగే బ్లైండ్‌ స్పాట్‌

బ్లైండ్ స్పాట్ సినిమాలో అదిరిపోయే సస్పెన్స్ ఉంది. ఇందులో మహిళ హత్యపై అనుమానం నలుగురిపైకి వెళ్తుంది. కానీ సినిమా చివరి 10 నిమిషాల్లో మొత్తం కథ మారిపోతుంది. హంతకుడు ఎవరనేది తెలిస్తే ఎవరూ నమ్మలేరు.

45
జియో హాట్‌ స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌లో బ్లైండ్‌ స్పాట్‌

బ్లైండ్ స్పాట్ సినిమాలో నవీన్ చంద్ర, అలీ రెజా, రాశి సింగ్, రవి వర్మ, కిషోర్ కుమార్, గాయత్రి భార్గవి, గురురాజ్ మానేపల్లి, సిద్ధార్థ్ గొల్లపూడి ప్రధాన పాత్రల్లో నటించారు. ఒక హత్య దర్యాప్తు చుట్టూ తిరిగే ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ను జియోహాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

55
థియేటర్లో ఆడని బ్లైండ్‌ స్పాట్‌

బ్లైండ్ స్పాట్ సినిమా మే 9, 2025న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సినిమాకు పెద్దగా ఆదరణ దక్కలేదు. అయితే, కొన్ని నెలల క్రితం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాక దీన్ని బాగా ఇష్టపడుతున్నారు. దీన్ని మ్యాంగో మాస్ మీడియా బ్యానర్‌పై నిర్మించారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories