Nani: ప్యారడైజ్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్.. నాని ఎమోషనల్ పోస్ట్

Published : Sep 25, 2026, 04:14 PM IST

Nani: ది ప్యారడైజ్ సినిమాతో థియేటర్ లో సందడి చేస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈమూవీకి భారీగా ఓపెనింగ్స్ రాడంతో పాటు.. కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. దాంతో సోషల్ మీడియా ట్రోల్స్ పై నాని ఎమోషనల్ గా స్పందించాడు.

PREV
14
ప్యారడైజ్ మూవీపై ట్రోల్స్..

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' (The Paradise). బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ డే రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించిన ఈమూవీ.. మంచి రెస్పాన్స్ తో పాటు సోషల్ మీడియాలో ట్రోల్స్ కి కూడా గురయ్యింది. ఆడియన్స్, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా, చిత్రం పట్ల ప్రేక్షకుల ప్రతిస్పందనపై, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ట్రోల్స్‌పై హీరో నాని సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఒక ఎమోషనల్ నోట్‌ను పంచుకున్నారు.

24
ట్రోల్స్‌ను స్పోర్టివ్‌గా తీసుకున్న నేచురల్ స్టార్

సాధారణంగా నెగిటివ్ కామెంట్లు లేదా ట్రోల్స్ వస్తే నటీనటులు డిఫెన్సివ్‌గా మారడం, స్పందించకుండా ఉండటం చూస్తుంటాం. కానీ, నాని మాత్రం తనదైన శైలిలో ఎంతో పరిణతితో, సరదాగా స్పందించారు. "ప్రేక్షకులు ఈ చిత్రాన్ని సొంతం చేసుకున్న విధానం చూసి నా మనసు నిండిపోయింది. మీరు అందిస్తున్న అపరిమితమైన ప్రేమతో పాటు, సోషల్ మీడియాలో వస్తున్న మీ ఫన్నీ ట్రోల్స్‌ను కూడా నేను సమానంగా ఆస్వాదిస్తున్నాను" అని నాని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. విమర్శలను కూడా చిరునవ్వుతో స్వీకరించిన నాని తీరును ఆయన అభిమానులతో పాటు నెటిజన్లు ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు.

34
తప్పుల నుంచి నేర్చుకుంటాం..

కేవలం ప్రశంసలను మాత్రమే కాకుండా విమర్శకుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను కూడా ఎంతో సానుకూలంగా తీసుకుంటున్నట్లు నాని తెలిపారు. "విమర్శకులు, ప్రేక్షకులు సినిమాలో ఎత్తిచూపిన లోపాలను, లోసుగులను నేను గమనించాను. వాటి నుంచి తప్పకుండా నేర్చుకుంటాను. భవిష్యత్తులో మిమ్మల్ని మరింతగా మెప్పించేందుకు ఈ సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయి" అని వ్యాఖ్యానించారు. కళాకారుడిగా నిరంతరం నేర్చుకోవడానికి, మెరుగుపడటానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన మరోసారి నిరూపించారు.

44
అంతటా 'ప్యారడైజ్' హవా..

రూ. 70 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్త వసూళ్లతో 'ది ప్యారడైజ్' గ్రాండ్ ఓపెనింగ్స్ సాధించి బాక్సాఫీస్ వద్ద నాని కెరీర్‌లోనే భారీ రికార్డులను సృష్టిస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం, శ్రీకాంత్ ఓదెల టేకింగ్, నాని మాస్ విశ్వరూపం ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. మిశ్రమ స్పందన ఉన్నప్పటికీ, థియేటర్ల వద్ద కలెక్షన్ల సునామీ కొనసాగుతుండటం విశేషం.

Read more Photos on
click me!

Recommended Stories