Hi Nanna Review: హాయ్ నాన్న ఆడియన్స్ టాక్, నాని ఎమోషనల్ మ్యాజిక్..

First Published | Dec 7, 2023, 7:20 AM IST

రొటీన్ కు స్వస్థి చెప్పి.. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు నేచురల్ స్టార్ నాని. అందులో భాగంగా ఆయన కొత్త దర్శకులను పరిచయం చేస్తూ.. ప్రయోగాలు చేస్తున్నాడు. ఎక్కువగాసక్సెస్ అవుతున్నాడు. ఈక్రమంలో నాని చేసిన తాజా సినిమాహాయ్ నాన్న. ఈరోజు రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీమిచర్స్ చూసిన ఆడియన్స్.. సినిమాపై అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వెల్లడిస్తున్నారు. మరి వారేమంటున్నారో చూద్దాం. 
 

నేచురల్ స్టార్ నాని, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా హాయ్ నాన్న. కూతురు సెంటిమెంట్ తో.. శౌర్యూప్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ.. నాని చేసిన ప్రయోగం ఈమూవీ.  ఇక హాయ్ నాన్న ఈరోజు( డిసెంబర్ 7) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో  సందడి చేయబోతోంది. ఈక్రమంలో ఒక రోజు ముందే ప్రిమియర్ల రూపంలో సందడి చేయగా.. హాయ్ నాన్నచూసిన ఆడియన్స్ తమ అభిప్రాయాలు ట్వీట్ రూపంలో వెల్లడిస్తున్నారు. మరి వారు ఏమంటున్నారో చూద్దాం. 

హాయ్ నాన్న సినిమాకు అంతట పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది. మంచిఫామ్ లో ఉన్న హీరో తండ్రిగా నటించడం అంటే... మన టాలీవుడ్ ఆడియన్స్ యాక్సప్ట్ చేస్తారో లేదో అన్న అనుమానం ఉంటుంది. కాని ఈ కాన్సెప్ట్ తో వచ్చిన కొన్ని సినిమాలు బాగా వర్కౌట్ అయ్యాయి. ఆ సినిమాల సరసన చేరింది హాయ్ నాన్న. ఈమూవీకి పాజిటీవ్ రివ్యూస్ వస్తున్నాయి ఆడియన్స్ నుంచి. 


ఇక ట్విట్టర్ లో ఆడియన్స .. సినిమా బాగా ఎమోషనల్ గా కనెక్ట్అవుతుందని అంటున్నారు. హాయ్ నాన్న సినిమా ఫర్‌ఫెక్ట్ ఎమోషన్స్‌తో రూపొందించారు. నాని అన్న ఫెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీశాడు. నేచురల్ యాక్టింగ్‌తో ఆకట్టుకొన్నాడు. మృణాల్ స్క్రీన్ పై అందంగా కనిపించింది. అద్బుతంగా నటించింది. సీత తరువాత మళ్ళీ అలాంటి పాత్రను  కంటిన్యూ చేసినట్టు అనిపించింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
 

హాయ్ నాన్న ఫస్టాఫ్ బాగుంది. సెకండాఫ్ ఫీల్ గుడ్, నాని, మృణాల్ కెమిస్ట్రీ బాగుంది. మొత్తంగా ఈసినిమా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్.  నాని నుంచి మరో మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. టీమ్‌కు కంగ్రాటులేషన్స్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

హాయ్ నాన్న సినిమా అద్భుతంగా ఉంది. ఇదొక  ఎమోషనల్ డ్రామా. సినిమా అంతా  నాని ఫెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీశాడు. అసలు సినిమాకు ప్రాణ పోసింది నానినే..ఆయన  సినిమాకు గుండె మాదిరిగా మారాడు. యష్ణ పాత్రను మృణాల్ తప్పించి ఇంకెవరూ చేయలేరేమో.  బేబీ కియారా యాక్టింగ్ ఎవరైనా పడిపోవల్సిందే అని ఓ ప్రేక్షకుడు ట్వీట్ చేశాడు. 
 

ఇక మరో నెటిజన్ అయితే.. సినిమా చూస్తున్నంతసేపు ఏడుస్తూనే ఉన్నాను అంటూ ట్వీట్ చేశాడు. ఇంత మంచి ఎమోషనల్ డ్రామాను అస్సలు మిస్ అవ్వదు. చాలా బాగుంది సినిమా. నాని అన్న పెర్ఫామెన్స్ తో ఏడిపించేశాడు అన్నారు. ఇలా దాదాపు గా హాయ్ నాన్న సినిమాకు అన్నీ పాజిటీవ్ రివ్యూస్ వచ్చాయి ఆడియన్స్ నుంచి. మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. 
 

Latest Videos

click me!