Nani: నేచురల్ స్టార్ ఏజ్ సీక్రెట్, వయసు కనిపించకుండా హీరో నాని ఏం చేస్తారో తెలుసా?

Published : Jul 23, 2026, 09:14 AM IST

Nani: టాలీవుడ్ స్టార్ హీరో నాని అసలు పేరు ఏంటి? ఆయన ఏజ్ దాచుకోడానికి ఏం చేస్తుంటారు? నాని హ్యాండ్సమ్, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా? ఆయన అసలు పేరునుఎలా వాడేవారంటే?

PREV
15
టాలీవుడ్ హీరోలలో నాని స్పెషల్..

నేచురల్ స్టార్ నాని టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. అనుకోకుండా హీరో అయ్యి.. అందరికంటే స్పెషల్ అని నిరూపించుకున్నాడు స్టార్ హీరో. కేవలం నటనతోనే కాకుండా, బయట మాట్లాడేటప్పుడు ఆయన చూపించే టైమింగ్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇటీవల తన వ్యక్తిగత జీవితం, చిన్ననాటి జ్ఞాపకాలకు సంబంధించిన పలు సరదా విషయాలను నాని వెల్లడించారు.

25
ఏజ్ తగ్గించుకోవడానికి నాని వాడే సీక్రెట్ ట్రిక్'

సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ దాన్ని దాచడానికి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ నాని స్టైలే వేరు! తన ఏజ్ తగ్గించుకోవడానికి ఆయన ఒక డిఫరెంట్ 'సీక్రెట్ ట్రిక్' చెబుతారు. ఆ ట్రిక్ తన పేరులోనే ఉందని ఆయన అన్నారు. అందరు తనను నాని అని పిలుస్తుంటారు. ఎంత ఏజ్ వచ్చినా.. దాదాపు అంతా నాని అనే పిలుస్తారు. అందరు అలా పిలవడం వల్ల తనకు తాను ఏజ్ తక్కువ అనే ఫీలింగ్ ను, పాజిటీవ్ ఆలోచనలను పెంచుకుంటానని నాని అన్నారు. అందుకేనేమో ఏజ్ పెరుగుతున్నా తాను ఇప్పటికీ ఇలా ఉండగలుగుతున్నానన్నారు. ఈ ట్రిక్‌తో మానసికంగా ఎప్పుడూ యంగ్‌గానే అనిపిస్తుందని నాని సరదాగా నవ్వుతూ చెప్పుకొచ్చారు.

35
నాని అని పిలవడంలో..

సినిమాల్లో మనందరికీ 'నాని'గా సుపరిచితుడైన ఆయన అసలు పేరు నవీన్ బాబు ఘంటా (Naveen Babu Ghanta).అఫీషియల్ పాస్‌పోర్ట్ లో కూడా అదే పేరు ఉంటుంది. ఆయన పాస్‌పోర్ట్ మాత్రమే కాదు ఆధార్ కార్డ్ , ఇతర అధికారిక పత్రాల్లో 'నవీన్ బాబు' అనే పేరు మాత్రమే ఉంటుంది. కానీ అందరు తనను నానీ అనే పిలుస్తుంటారు. చిన్నతనంలో స్కూల్లో చదువుకునేటప్పుడు టీచర్లు, ఇంట్లో పెద్దవాళ్ళు ప్రశంసించడానికి నానీ అనే పేరు వాడుతుంటారని ఆయన అన్నారు.

45
క్లాస్ పీకడానికి మాత్రమే అసలు పేరు..

నాని చిన్నప్పుడు ఏదైనా అల్లరి చేసినప్పుడు, క్లాస్‌లో హోమ్‌వర్క్ చేయక టీచర్లు గట్టిగా కేకలేసి తిట్టాల్సి వస్తే మాత్రం "నవీన్ బాబు...!" అంటూ ఆయన అసలు పేరు పెట్టి పిలిచేవారట. అందుకే టీచర్లు 'నవీన్' అని పిలిచారంటే చాలు, ఏదో పెద్ద తిట్టు పడబోతోందని అర్థం చేసుకునేవాడినని నాని గుర్తుచేసుకున్నారు. వెండితెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ తనదైన చమత్కారంతో మాట్లాడే నేచురల్ స్టార్ నాని త్వరంలో ది ప్యారడైజ్ మూవీతో సందడి చేయబోతున్నాడు.

55
ప్యారడైజ్ కోసం అభిమానులు ఎదురుచూపులు..

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అడ్వాన్స్డ్ అప్ కమింగ్ మూవీ 'ది ప్యారడైజ్' (The Paradise). శ్రీకాంత్ ఒదేల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా చిత్రం 2026 అగస్ట్ 21 న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ భారీ బడ్జెట్ పాన్-ఇండియా మూవీ తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. ఈ సినిమా కోసం నేచురల్ స్టార్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈసినిమాతో నాని టైర్ 1 హీరోల లిస్ట్ లో చేరిపోవడం ఖాయం అంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories