Bigg Boss5లో గుంటనక్క ఎవరో తెలిసింది.. వారిని జంతువులతో పోల్చిన నటరాజ్‌ మాస్టర్‌.. ఎలిమినేషన్‌కి కారణాలివే

Published : Oct 03, 2021, 11:11 PM IST

బిగ్‌బాస్‌ 5 నాల్గో వారం ముగిసింది. ఈ వారం ఎలిమినేట్‌ అయ్యే కంటెస్టెంట్‌ ఎవరనేది ముందు నుంచి అనుకున్నదే జరిగింది. నటరాజ్‌ మాస్టర్ ఎలిమినేట్‌ అయ్యారు. ఈ సందర్భంగా హౌజ్‌ మొత్తం ఎమోషనల్‌ అయ్యింది. హౌజ్‌లోని సభ్యులంతా భావోద్వేగానికి గురికావడం ఈ నాలుగు వారాల్లో ఫస్ట్ టైమ్‌.  

PREV
16
Bigg Boss5లో గుంటనక్క ఎవరో తెలిసింది.. వారిని జంతువులతో పోల్చిన నటరాజ్‌ మాస్టర్‌.. ఎలిమినేషన్‌కి కారణాలివే

బిగ్‌బాస్‌ 5 సీజన్‌ ఆద్యంతం రసవత్తరంగా సాగుతుంది. హౌజ్‌లోకి వచ్చింది చాలా కొత్త ఫేసులే అయినా తమదైన ఆట తీరుతో త్వరగానే ఆకట్టుకుంటున్నారు. అయితే కొంత మేర శృతి మించినా ఇప్పుడు ఫర్వాలేదనిపించుకుంటున్నారు. ఇప్పటికే నాలుగు వారాలు ముగిసాయి. సరయు, ఉమాదేవి, లహరి, ఇప్పుడు నటరాజ్‌ మాస్టర్‌ ఎలిమినేట్ అయ్యారు. అంతా ఊహించినట్టే జరిగింది. నటరాజ్‌ మాస్టర్‌ ఎలిమినేట్‌ అవుతారని గత రెండు మూడు రోజులుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. 

26

ఈ సందర్భంగా ఇంటి సభ్యులు నటరాజ్‌ మాస్టర్‌ ఎలిమినేషన్‌తో భావోద్వేగానికి గురయ్యారు. తనకు సపోర్ట్ గా ఉండేవారి ఆనీ మాస్టర్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రియాంక సైతం హగ్‌ చేసుకుని కన్నీరుమున్నీరయ్యింది. అలాగే లోబో ఎక్కి ఎక్కి ఏడ్చారు. ఆయనతో సన్నివేశాలను గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అయ్యారు. ఇలా ప్రతి ఒక్కరు తమ బాధని వ్యక్తం చేశారు. స్టేజ్‌పైకి వచ్చిన  నటరాజ్‌ మాస్టర్‌ సైతం తన జర్నీని చూసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. 
 

36

ఏదో సాధిస్తానని హౌజ్‌లోకి వచ్చానని తెలిపాడు. కానీ అర్థాంతరంగా వెళ్తున్నానని తెలిపారు. తన జర్నీ ఏంటో అర్థం కావడం లేదన్నారు. కానీ హౌజ్‌లోకి రావడమే నువ్వు సాధించినట్టు లెక్క అని తెలిపారు నాగార్జున. నీ అవసరం తనభార్యకి ఉందేమో, అందుకే దేవుడు పంపిస్తున్నాడేమో అని చెబుతూ ఓదార్చాడు. 

46

ఈ సందర్భంగా హౌజ్‌లో ఉన్న ఇక మిస్టరీకి ఫుల్‌ స్టాప్‌ పెట్టాడు నటరాజ్‌ మాస్టర్‌. నామినేషన్‌లో ఓ గుంట నక్క మేక రూపంలో వచ్చింది. అందరిని చెడగొడుతుందన్నారు. అయితే అది ఎవరనే విషయాన్ని ఇప్పటి వరకు దాస్తూ వచ్చిన నటరాజ్‌ మాస్టర్‌ అది ఎవరో చెప్పేశాడు. యాంకర్‌ రవి అని తెలిపారు. దీనికి రవి స్పందిస్తూ ఆ విషయం తనకు ముందే తెలుసన్నారు. 
 

56

మరోవైపు ఎనిమిది మంది సభ్యులను జంతువులతో పోల్చారు నటరాజ్‌ మాస్టర్‌. బిగ్‌బాస్‌ చెప్పిన దాని ప్రకారం జంతువులతో పోల్చాలన్నప్పుడు సిరిని పాముతో పోల్చాడు. లోబోని ఎలుకతో, విశ్వని ఊసరవెళ్లితో పోల్చాడు. అలాగే శ్రీరామ్‌ ముసలి అని, ప్రియాంక చిలుకా అని, గాడిద మానస్‌ అన్నారు. అయితే సింహం ఎవరు అని చెప్పాల్సి వచ్చినప్పుడు తనే సింహం అన్నాడు నటరాజ్‌.
 

66

అయితే నటరాజ్‌ మాస్టర్‌ ఎలిమినేసన్‌కి కారణాలేంటనేది ఆసక్తిగా మారింది. ఆయన అతి ప్రవర్తనే కారణమానే కామెంట్లు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి. సినిమాల్లో మాదిరిగా హౌజ్‌లోనూ ప్రవర్తించడం, తనకు తానేగొప్ప అనే ఫీలింగ్లో ఉండటం ఆయనకు తక్కువ మార్కులు పడేందుకు కారణమని అంటున్నారు. అంతేకాదు ఇతర ఇంటి సభ్యులతో అంతగా యాక్టీవ్‌గా మూవ్‌ అయినట్టుగా ఉండరని, ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారని కామెంట్లు చేస్తున్నారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories