Aay Movie: ‘ఆయ్‌’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

First Published | Sep 10, 2024, 11:31 AM IST

 'ఆయ్‌' బాక్సాఫీస్‌ వద్ద రూ. 20 కోట్లకు పైగానే రాబట్టినట్లు తెలుస్తోంది. 

ఎలాంటి ఎక్సపెక్టేషన్స్  లేకుండా చిన్న సినిమాగా విడుదలై మంచి విజయం సాధించిన చిత్రం ‘ఆయ్‌’. ఆగష్టు 15న రిలీజ్‌ అయిన ఈ చిత్రం ఓ వర్గం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆగ‌స్టు 15న రవితేజ మిస్టర్ బచ్చన్, రామ్ డబుల్ ఇస్మార్ట్, విక్రమ్ తంగలాన్ వంటి పెద్ద చిత్రాల‌తో పోటీ ప‌డుతూ బ‌రిలోకి దిగింది.

ఆయ్ సినిమాకు మొదటి రోజు  టాక్ పాజిటివ్ గా  చెప్పుకోదగ్గ కలెక్షన్స్  రాలేదు. కానీ మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు నెగ‌టివ్ టాక్ తో బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ‌టం, తంగ‌లాన్ టాక్ బాగున్నా పెద్దగా ఇంపాక్ట్ చూప‌కపోవ‌డంతో.. ఆయ్ మూవీ అదరకొట్టింది.  ఇప్పుడీ చిత్రం ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది.ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 సీజన్ అప్‌ డేట్లు, ఇంట్రెస్టింగ్‌ వార్తల కోసం ఇక్కడ చూడండి.
 

Narne Nithiin,l jr ntr, AAY, OTT

 ఈ చిత్రం యొక్క డిజిట‌ల్ రైట్స్ ను ప్ర‌ముఖ దిగ్గ‌జ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.  సెప్టెంబ‌ర్ 12న నెట్‌ఫ్లిక్స్ లో ఆయ్ మూవీని స్ట్రీమింగ్ చేయ‌బోతున్న‌ట్లు నెట్‌ఫ్లిక్స్ అఫీషియ‌ల్ గా ప్ర‌క‌టించింది.  థియేట‌ర్స్ లో మిస్ అయిన వారు ఈ నెల 12న నెట్‌ఫ్లిక్స్ ను ఆయ్ ను చూసి ఎంజాయ్ చేయవచ్చు.

అలాగే మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, హ‌రీష్ శంక‌ర్ కాంబోలో తెర‌కెక్కిన హ్యాట్రిక్ మూవీ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ కూడా అదే రోజు నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతోంది.  అంటే థియేటర్ లోనే కాకుండా ఓటిటిలో కూడా ఈ రెండు సినిమాలు పోటీ పడుతున్నాయన్నమాట.

Latest Videos


Narne Nithiin,l jr ntr, AAY, OTT

చిన్న సినిమాగా తెరకెక్కిన 'ఆయ్‌' బాక్సాఫీస్‌ వద్ద రూ. 20 కోట్లకు పైగానే రాబట్టినట్లు తెలుస్తోంది. ఓటీటి లో మంచి రేటుకు అమ్మినట్లు తెలుస్తోంది. దాంతో నిర్మాత మంచి హ్యాపీగా ఉన్నారు.  తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ,మలయాళంలో విడుదల కానుంది. అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్‌పై బన్నీ వాసు, విద్యా కొప్పినీడి ఈ సినిమాను నిర్మించారు.

Narne Nithiin,l jr ntr, AAY, OTT


చిత్రం క‌థేంటంటే: కార్తీక్ (నార్నె నితిన్) అమ‌లాపురం కుర్రాడు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేర‌తాడు. కరోనా లాక్‌డౌన్ వ‌ల్ల ఊరికొస్తాడు. వర్క్ ఫ్రమ్ హోం చేసుకుంటూనే, చిన్న‌నాటి స్నేహితులైన హరి(అంకిత్ కోయ), సుబ్బు(రాజ్ కుమార్ కసిరెడ్డి)తో క‌లిసి సరదాగా గడుపుతుంటాడు. పక్క ఊరికి చెందిన పల్లవి (నయన్ సారిక)ని చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు. సోషల్ మీడియాలో చ‌లాకీగా ఉండే అమ్మాయి ప‌ల్ల‌వి. కులం ప‌ట్టింపులు ఎక్కువ‌. కార్తీక్ తన కులం వాడేననుకొని ఇష్టపడుతుంది. 

Narne Nithiin,l jr ntr, AAY, OTT


ఆ తర్వాత అత‌ని కులం వేర‌ని, ఆ విష‌యం తెలిస్తే తన తండ్రి(మైమ్ గోపి) చంపేస్తాడని దూరం పెడుతుంది. పెద్ద‌లు కుదిర్చిన పెళ్లికి అంగీకారం తెలుపుతుంది. కులం కారణంగా పల్లవి తన ప్రేమను కాదనడంతో కార్తీక్ తట్టుకోలేకపోతాడు. మ‌రోవైపు పల్లవి, కార్తీక్‌లని క‌లిపేందుకు స్నేహితులైన  హరి, సుబ్బు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. స్నేహితుల ప్ర‌య‌త్నం ఫ‌లించిందా? త‌న కొడుకు ప్రేమ విష‌యం తెలుసుకున్న కార్తీక్ తండ్రి  బూరయ్య (వినోద్ కుమార్‌) ఏం చేశాడు? పల్లవితో కార్తీక్  పెళ్లి జరిగిందా లేదా? అన్నది కథ  
 

click me!