నాని "వి" మూవీ ప్లాప్: తెలుగు సినిమా సెంటిమెంట్ ఇదీ....

First Published Sep 5, 2020, 4:37 PM IST

వి చిత్రం విడుదలకు ముందు ఎంత హైప్ అయితే ఉండిందో... సినిమా విడుదలయిన తరువాత ఒక్కసారిగా నీరుగారిపోయింది. సినిమాలోని ఏ అంశాలు ఎవరికీ నచ్చలేదు అనే విషయాన్నీ పక్కనబెడితే... మోహనకృష్ణ ఇంద్రగంటి వంటి దర్శకుడి స్థాయిలో ఆ సినిమా లేదు అనేది నిర్వివాదాంశం. 

థియేటర్లు మూతపడడంతో విపరీతమైన హైప్ మధ్య టాలీవుడ్ నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో ఒక పెద్ద సినిమా నేడు ఓటిటి ద్వానా విడుదలయింది. నాని,సుధీర్ బాబులు ప్రధాన పాత్రల్లో మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన "వి" చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదలయింది.
undefined
వి చిత్రం విడుదలకు ముందు ఎంత హైప్ అయితే ఉండిందో... సినిమా విడుదలయిన తరువాత ఒక్కసారిగా నీరుగారిపోయింది. సినిమాలోని ఏ అంశాలు ఎవరికీ నచ్చలేదు అనే విషయాన్నీ పక్కనబెడితే... మోహనకృష్ణ ఇంద్రగంటి వంటి దర్శకుడి స్థాయిలో ఆ సినిమా లేదు అనేది నిర్వివాదాంశం.
undefined
ఇక ఈ సినిమా కూడా హిట్ టాక్ సాధించలేకపోవడంతో... సెంటిమెంట్లవైపుగా చూస్తున్నారు టాలీవుడ్ అభిమానులు. వి అనే ఆంగ్ల ఆల్ఫాబెట్ ప్రధానంగా వచ్చిన తెలుగు సినిమాలన్నీ కూడా ఫ్లాపుల బాట పట్టాయనే పాత విషయాన్నికొత్తగా తెర మీదకు తీసుకొస్తున్నారు. ఈ వి సినిమా ప్లాప్ తో మరోసారి ఆ సెంటిమెంటు చర్చనీయాంశమయింది.
undefined
ముందుగా మనకు ఈ కోవలో కనిపించే చిత్రం "ఒక విచిత్రం." ఆది పినిశెట్టి, ప్రధాన పాత్రల్లో తేజ తెరకెక్కించిన చిత్రం ఒక విచిత్రం. ఈ సినిమా టైటిల్ లో కూడా విచిత్రంలో వి ఆంగ్ల అక్షరం వచ్చేలా పెట్టారు. ఈ సినిమాప్లాప్ అయింది.
undefined
ఇక ఇదే కోవలోకి వచ్చే మరో చిత్రం విక్టరీ. నితిన్, మమతా మోహన్ దాస్ జంటగా రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కూడా ప్లాప్ అయింది. ఇందులో కూడా విఅనే అక్షరాన్ని పోరాచారాన్ని విరివిగా ఉపయోగించారు.
undefined
ఈ సెంటిమెంటును బలపరిచే మరో చిత్రం విష్ణు. మంచు విష్ణు హీరోగా నటించిన తొలి చిత్రం. చిత్రం పేరు విష్ణు అయినప్పటికీ... సినిమా ప్రచార కార్యక్రమాలన్నింటా వి అనే విక్టరీ సింబల్ గా రెండు వేళ్ళనుచూపెడుతూ.... సినిమా ప్రొమోషన్లను నిర్వహించారు. ఆ సినిమా కూడా ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది.
undefined
2018లో అంతా విచిత్రం పేరిట ఒక కామెడీ డ్రామా 2018లో తెరకెక్కింది. నిఖిల్, ఇషిక ప్రధాన పాత్రల్లో రామ్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందించబడింది. ఈ సినిమా టైటిల్ లో కూడా విచిత్రంలో "వి"ని ఆంగ్ల ఆల్ఫాబెట్ రూపంలో రాసారు. ఈ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది.
undefined
ఇక తాజాగా వచ్చిన "వి" చిత్రం. ఏకంగా పేరులోనే వి అని ఉండడం, ఆంగ్ల అక్షరంలోనే అది రాయడంతో ఈ సినిమా ఫ్లాప్ అయిందనే సెంటిమెంటు బలంగా ప్రచారంలో ఉంది.చూడబోతుంటే..,ఆంగ్ల వి అక్షరం సెంటిమెంటు టాలీవుడ్ కు పెద్దగా కలిసివచ్చినట్టుగా కనబడడం లేదు.
undefined
click me!