Ante Sundaraniki OTT Date Fix: నాని సర్‌ప్రైజ్.. `అంటే సుందరానికి` ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్..

First Published Jul 3, 2022, 8:29 PM IST

నేచురల్‌ స్టార్‌ నాని డిజిటల్‌ లో సందడి చేసేందుకు వస్తున్నారు. ఆయన నజ్రియాతో కలిసి నటించిన `అంటే సుందరానికి` మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్ అయ్యింది. 
 

నాని(Nani), నజ్రియా నజీమ్‌(Nazriya) కలిసి నటించిన చిత్రం `అంటే సుందరానికి`(Ante Sundaraniki). నజ్రియా నటించిన తొలి తెలుగు సినిమా కావడం విశేషం. సింపుల్‌ స్టోరీస్‌తో ఫన్‌ జనరేట్‌ చేస్తూ సక్సెస్ అందుకునే వివేక్‌ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈసినిమా జూన్‌ 10న విడుదలైన విషయం తెలిసిందే. 

వివేక్‌ ఆత్రేయ రూపొందించిన చివరి చిత్రం `బ్రోచేవారెవరురా` సినిమా మంచి విజయాన్ని సాధించింది. దీంతో అంతకు ముందు సినిమాలు కూడా విజయాలు అందుకున్నాయి. దీంతో వివేక్‌ అంటే మినిమమ్‌ గ్యారంటీ డైరెక్టర్‌ అనే పేరుంది. ఆయన డైరెక్షన్‌లో వరుస పరాజయాలతో ఉన్న నాని నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. పైగా నాని ఇలాంటి హ్యూమర్‌ ఉన్న కథలంటే చిచ్చేస్తారు. మరోవైపు `రాజారాణి`తో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైన నజ్రియా హీరోయిన్‌ కావడంతో మరింతగా హైప్‌ నెలకొంది. 
 

భారీ అంచనాలతో తెలుగుతోపాటు తమిళం, మలయాళంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా 30కోట్ల బిజినెస్‌తో థియేటర్‌లోకి రాగా, కేవలం 20కోట్ల షేర్‌ వద్దే డీలా పడిపోయింది. దీంతో సుమారు సగానికిపైగా నష్టాలు చవిచూడాల్సి వచ్చింది.  `శ్యామ్‌ సింగరాయ్‌`తో కాస్త పుంజుకున్న నానికి `అంటే సుందరానికి`తో గట్టి షాక్‌ తగిలింది. 

ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ ఫ్యాన్స్‌ని అలరించడానికి రాబోతుంది. జులై 10న (Ante Sundaraniki OTT Release Date) ఓటీటీలో ప్రసారం కానుంది. నెట్‌ఫ్లిక్స్ లో వచ్చే ఆదివారం నుంచి సందడి చేయబోతుండటం విశేషం. తాజాగా ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్, హీరో నాని ప్రకటించారు. సుందర్, లీలా వెడ్డింగ్‌ చూడ్డానికి ఇన్వైట్‌ చేశారు. ఇందులో నాని సుందర్‌గా, నజ్రియ లీలాగా నటించారు.

అయితే ముందుగా సినిమాని జులై 8న ఓటీటీలో విడుదల చేయబోతున్నట్టు వార్తలొచ్చాయి. కానీ అందులో నిజం లేదని తాజా అధికారిక ప్రకటన స్పష్టం చేసింది. చాలా సినిమాలు థియేటర్లో ఆదరణ పొందలేకపోయాయి. కానీ ఓటీటీలో మంచి వ్యూవర్స్ ని సొంతం చేసుకున్నాయి. అలాగే `అంటే సుందరానికి` విషయంలోనూ అలానే జరుగుతుందని ఆశిస్తున్నారు. 

ఈ సినిమా థియేటర్‌లో తెలుగుతోపాటు తమిళం, మలయాళంలోనూ విడుదలైంది. అలాగే నెట్‌ ఫ్లిక్స్ లోనూ తెలుగుతోపాటు తమిళం, మలయాళ భాషల్లోనే ఏక కాలంలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ పదికోట్లకుపైగానే అమ్ముడు పోయిందని టాక్. అలాగే శాటిలైట్స్(జెమినీ టీవీ) ద్వారా కూడా బాగానే వచ్చాయట. దీంతో మొత్తంగా సినిమా విషయంలో నిర్మాతలు సేఫ్‌లోనే ఉన్నారని, కానీ డిస్ట్రిబ్యూటర్లు దారుణంగా నష్టపోయినట్టు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. 

click me!