Nani Movie Record: ఐదేళ్ల క్రితం వచ్చిన సినిమాతో అరుదైన రికార్డ్ సాధించిన నేచురల్ స్టార్ నాని

Published : Apr 22, 2022, 11:50 AM ISTUpdated : Apr 22, 2022, 12:12 PM IST

ఎప్పుడో ఐదేళ్ల క్రితం చేసిన సినిమా నానీకి సరికొత్త రికార్డ్ ను సాధించి పెట్టింది. అనుహ్యంగా, అనుకోకుండా ఆ మూవీకి వచ్చిన రెస్పాన్స్ టీమ్ మొత్తాన్ని సంతోషంలో మునిగి తేలేలా చేస్తోంది. 

PREV
17
Nani Movie Record: ఐదేళ్ల క్రితం వచ్చిన సినిమాతో అరుదైన రికార్డ్ సాధించిన నేచురల్ స్టార్ నాని

గెలుపుఓటములతో సంబంధం లేకుండా.. సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు నేచురల్ స్టార్ నానీ. ఒక సారి సక్సెస్, ఒక సారి పెయిల్యూర్, ఇలా సాగుతూ ఉంది నానీ కెరీర్. ఇక నానీ కి ఐదేళ్ల క్రితం తీసిన సినిమా పట్టరాని ఆనందాన్ని ఇచ్చింది. పాత సినిమా కోత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. 

27

తెరపై ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించడానికి ప్రయత్నిస్తాడు నాని. అలాగే తన కథల విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. తన కథలో కొత్తదనం కోసం చివరి నిమిషం వరకూ ఆయన ట్రై చేస్తూనే ఉంటాడు నేచురల్ స్టార్.

37

నానీ సినిమాలు ప్లాప్ అయినా.. దాదాపు  ఆడియన్స్ ను  నిరాశపరచవు. సినిమా హిట్ కాకపోయినా.. ఆడియన్స్ చూసే విధంగానే ఉంటాయి . దాంతో నానీకి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఇమేజ్ ఉంది. దానికి తోడు ఈమధ్య ఎక్కువగ ప్రయోగాలు కూడా చేస్తున్నాడు నేచురల్ స్టార్. 
 

47

నానీ చేసిన చెప్పుకోదగిన సినిమాలలో నేను లోకల్  ఒకటి. త్రినాథ రావు నక్కిన డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు.  2017 ఫిబ్రవరి 3న రిలీజ్ అయిన ఈసినిమా రిలీజ్ అవ్వడంతోనే హిట్ టాక్ తొ దూసుకుపోయింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.
 

57

నానీ నేను లోకల్ సినిమా సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. థియేటర్లలోనే కాకుండా బుల్లి తెరపై. ఆపైన సోషల్ మీడయా ప్లాట్ ఫామ్ లో కూడా మంచి రెస్పాన్స్ ను సాధించింది. రీసెంట్ గా యూటూబ్యూలో ఈ మూవీ అద్భఉతమైన రెస్పాన్స్ ను సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. 
 

67

యూ ట్యూబ్ లో వదిలిన తరువాత ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోయింది. ఇంతవరకూ ఈ సినిమా 100 మిలియన్ ప్లస్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. నానీ సినిమా 10 కోట్ల రికార్డ్ వ్యూస్ ను సాదించడం ఇదే ఫస్ట్ టైమ్. నాని కెరియర్లో యూ ట్యూబ్ వైపు నుంచి అరుదైన రికార్డును అందించిందీ మూవీ. 

77

ఇక  ప్రస్తుతం మూడు సినిమాలకు పైనే సెట్స్ టెక్కించాడు నానీ. రీసెంట్ గా శ్యామ్ సింగ్ రాయ్ సినిమాతో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న నేచురల్ స్టార్ త్వరలో అంటే సుందరానికీ రిలీజ్ కు ముస్తాబు అవుతుంది. ఇక  సెట్స్ పై  నానీ ఎక్స్ పెర్మెంటల్ మూవీ దసరా సినిమా ఉంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories