కేరళ కుట్టి, హీరోయిన్ నజ్రియా ఫహద్ అందం, అభినయంలో స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు. ఇన్నాళ్లు తమిళం, మలయాళం చిత్రాలతో అలరించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్ ను కూడా అలరించేందుకు సిద్ధమైంది.
28
తాజాగా నేచురల్ స్టార్ నాని నటించిన ‘అంటే సుందరానికీ’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. తెలుగులో నజ్రియా చేసిన తొలి చిత్రం ఇది. గతంలో ‘రాజా రాణి’ తమిళ సినిమా తెలుగు వెర్షన్ తో ఆడియెన్స్ ను పరిచయం అయ్యిందీ బ్యూటీ. ప్రస్తుతం నాని సినిమాలో నటించి తన మార్క్ చూపించింది.
38
తొలి సినిమాతోనే టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వడంతో పాటు, హిట్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకుంది. యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయా తెరకెక్కించిన ‘Ante Sundaraniki’ చిత్రంలో నజ్రియా ‘లీలా’పాత్రను పోషించింది. ఈ మూవీలో ఆమె నటించడం పట్ల ప్రేక్షకులు, నాని అభిమానులు కూడా ఫుల్ ఫిదా అవుతున్నారు.
48
ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ రావడంతో మున్ముందు నజ్రియాకు తెలుగు సినిమాల్లో మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ లేకపోలేదు. పైగా నజ్రియాకు కూడా టాలీవుడ్ లో మంచి గుర్తింపు ఏర్పడింది. నాని ఇచ్చిన బ్రేక్ తో నజ్రియా భవిష్యత్ లో మరిన్ని చిత్రాల్లో కనిపించే అవకాశం లేకపోలేదు.
58
ఇదిలా ఉంటే, నజ్రియా అటు సినిమాల్లోనే కాకుండా ఇటు సోషల్ మీడియాలోనూ తన సత్తా చూపిస్తోంది. ట్రెండీ అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ నెటిజన్లను తనవైపునకు తిప్పుకుంటోంది. ఈ బ్యూటీ అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. మతిపోయే ఫొటోషూట్లతో నజ్రియా ఆకట్టుకుంటుండం విశేషం.
68
లేటెస్ట్ గా తన చేసిన ఫొటోషూట్ అట్రాక్టివ్ గా ఉంది. ఈ అదిరిపోయే దుస్తుల్లో నజ్రియా ఫొటోలకు స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చింది. ఆ పిక్స్ ను తాజాగా అభిమానులతో ఇన్ స్టా గ్రామ్ ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరోవైపు నెటిజన్లు కూడా ఆమె పిక్స్ ను లైక్ చేస్తూ.. కామెంట్స్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు.
78
ఈ పిక్స్ లో నజ్రియా లైట్ పింక్ డ్రెస్ లో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. సోఫాపై ఒకపక్కకు వాలుతూ ఫొటోలకు ఇచ్చిన పోజులు కుర్రాళ్ల హార్ట్ బీట్ ను పెంచుతున్నాయి. గ్లామర్ షో చేస్తూ ఈ బ్యూటీ నెట్టింట తన క్రేజ్ పెంచుకుంటోంది. స్టన్నింగ్ స్టిల్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. అంటే సుందరానికీ చిత్రాన్ని సక్సెస్ చేసినందుకు చివరిసారిగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ పిక్స్ ను షేర్ చేసింది.
88
మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ ను 2014లోనే ప్రేమించి పెళ్లి చేసుకుందీ బ్యూటీ. వివాహామనంతరం కూడా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. పైగా తన భర్త నుంచి కూడా ఆమె మద్దతు ఉండటంతో మంచి కంటెంట్ ఉన్న చిత్రాల్లో నటించేందుకు నజ్రియా ముందుకు వస్తోంది. ఫహద్ ఫాజిల్ ‘ఫుష్ఫ’, ‘విక్రమ్’ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కు మరింత దగ్గరయ్యాడు.