పగలే కాచిన వెన్నెలవోలె ఆకర్షిస్తున్న ‘ఢీ’ బ్యూటీ.. పట్టుచీరలో మెరిసిపోతున్న అందాల సుందరి పూర్ణ

First Published | May 20, 2022, 12:04 PM IST

నటి పూర్ణ (Poorna) ట్రెడిషనల్ వేర్ లో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. పగలే కాచిన వెన్నవోలె కనువిందు చేస్తోంది. పట్టుచీరలో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్ల చూపులను తనవైపు తిప్పుకుంటోంది. ఈ సుందరి లేటెస్ట్ ఫొటోషూట్ తో మెస్మరైజ్ చేస్తోంది.   
 

కేరళ బ్యూటీ పూర్ణ బుల్లితెర నుంచి వెండితెర వరకు ప్రేక్షకులందరినీ అలరిస్తోంది. అటు టీవీ షోల్లో మెరుస్తూనే ఇటు సినిమాల్లోనూ విభిన్న పాత్రలో నటిస్తూ తన పాపులారిటీని పెంచుకుంటోంది. ప్రస్తుతం అరడజను చిత్రాల్లో నటిస్తున్న పూర్ణ బిజీయేస్ట్ యాక్ట్రెస్ అనిపించుకుంటోంది.
 

అయితే, తెలుగు, తమిళ, మాలయాళ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియలోనూ ఓ రేంజ్ లో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ ఫొటోషూట్లు చేస్తూ మతిపోగొడుతోంది. చీరకట్టు అందాలతో కుర్రాళ్ల గుండెల్ని దోచుకుంటోంది. తాజాగా తను మరిన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 
 


పర్పుల్ కలర్ పట్టుశారీలో పూర్ణ మహారాణిలా కనిపిస్తోంది. కాస్ల్టీ జ్యూవెల్లరీ ధరించి.. బంగారు బొమ్మలా ఆకర్షిస్తోంది. చిరునవ్వుతో కుర్రకారు గుండెల్లో చిన్నపాటి సునామీనే పుట్టిస్తోంది. నల్లని కురులకు తెల్లని మల్లెపూలు చుట్టుకొని నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. చీరకట్టు అందాలను చూపిస్తూ నెక్ట్స్ లెవల్ అనిపిస్తోంది.  
 

పట్టుచీర, జ్యూవెల్లరీలో ఢీబ్యూటీ మరింత మెరిసిపోతోంది. తన బ్యూటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ముద్దుగా బొద్దుగా కనిపిస్తున్న పూర్ణ ఒక్కో ఫొటోకు ఒక్కోలా ఫొజులిస్తూ యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చీరకట్టులో చాలా చాలా అందంగా కనిపించడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె నుంచి చూపు తిప్పుకోలేకపోతున్నారు.  
 

పూర్ణను తన అభిమానులు ఎక్కువగా సంప్రదాయ దుస్తుల్లో చూసేందుకు ఇష్టపడుతారు. నిజానికి ఆమె వెస్ట్రన్ వేర్ లో కంటే.. చీరకట్టులో చాలా అందంగా కనిపిస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పూర్ణ కూడా ఎక్కువగా చీరలోనే దర్శనమిస్తూ తన అభిమానులు ఖుషీ చేస్తుండటం విశేషం. అలా అని ట్రెండీ వేర్స్ కూ దూరమూ కాదు. 
 

కాగా, ఢీ (Dhee) షోతో  నటి పూర్ణ తన పాపులారిటీని ఎక్కువగా పెంచుకుంది. ఈ రియాలిటీ షో ద్వారా అటు ప్రేక్షకులకు, ఇటు టెలివిజన్ ఆడియెన్స్ కు ఎంతో దగ్గరైంది. ఆ క్రేజ్ తోనే మరోవైపు వరుస సినిమాల్లోనూ వరుస ఆఫర్లను దక్కించుకుంటోంది. ఇటీవల ‘అఖండ’లో మంచి ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించింది. 
 

తెలుగులో చివరిగా ‘అఖండ’లో కనిపించిన పూర్ణ ప్రస్తుతం తెలుగులోనే మరో రెండు చిత్రాల్లో నటిస్తోంది. ‘బ్యాక్ డోర్, తెలుగులో నాకు నచ్చని పదం ప్రేమ’ అనే సినిమాల్లో నటించింది. ఈ చిత్రాలు ప్రస్తుతం రిలీజ్ సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు తమిళంలోనూ మరో నాలుగైదు చిత్రాల్లో నటించగా.. అవి రిలీజ్ కావాల్సి ఉంది.

అటు నటిగా అలరిస్తూనే.. ఇటు టీవీ షోలకు జడ్జీగాను వ్యవహరిస్తోంది పూర్ణ. బుల్లితెరపై తన గ్లామర్ మెరుపులతో షోలో అట్రాక్షన్ నెలకొల్పుతోంది. తెలుగు లాంగ్వేజీలో స్టార్ మాలో ప్రసారం అవుతున్న ‘కామెడీ స్టార్స్ ధమాకా’షోకు ప్రస్తుతం జడ్జీగా కొనసాగుతోంది. 

Latest Videos

click me!