ఈరోజు ఎపిసోడ్ లో విక్రమ్ కోపంతో మాట్లాడుతూ నేను మనసున్న మనిషిని, చెప్పే మాటకి కట్టుబడే మనిషిని అనగా అప్పుడు బసవయ్య విక్రమ్ ని మరింత రెచ్చగొడుతూ ఈ ప్రపంచంలో కన్నతల్లి ప్రేమ మీద పోటీపడేది భార్య ప్రేమ మాత్రమే అని అంటాడు. ఇంతకుముందే చెప్పాను ఇప్పుడు మళ్లీ చెబుతున్నాను నా జీవితంలోకి ఎవరు వచ్చినా అమ్మ స్థానం తర్వాతే అని ఆవేశపడే మాట ఇస్తాడు విక్రమ్. నాకు అమ్మ మాట తర్వాతే ఏదైనా అని గట్టిగా అరిచి చెబుతాడు. ఆ మాటలకు రాజ్యలక్ష్మి సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు అందరూ కలిసి విక్రమ్ ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ మాట్లాడుతారు.