
ఈరోజు ఎపిసోడ్లో మాధవి వాళ్లు ఒకరికి రావడంతో దివ్య వెళ్లి ప్రేమగా పలకరిస్తుంది. అప్పుడు తులసి సరదాగా మేనకోడలు పెళ్లి దగ్గరుండి చేస్తామనుకున్నాను కానీ ఇలా చుట్టం చూపులా వస్తావని అనుకోలేదు అనడంతో నాకు వదిన పిలుపులు అందాయి అందుకే నేను అలిగాను అని అంటుంది మాధవి. అవునా ఏం లోటు వచ్చింది ఇంటికి పల్లకి పంపించమంటావా అనగా అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు అందరూ సంతోషంగా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ప్రేమ్ మొత్తానికి నీ మొగుడిని నువ్వు వెతుకున్నావ్ కదే అనగా మరి ఏం చేస్తాం మా అన్నయ్యలు నన్ను వదిలి వెళ్ళిపోయారు మా వదినలు మొగుడిని పట్టుకు కూర్చున్నారు అని అంటుంది.
బావగారి ఫోటో చూశాను బొట్టు పెట్టుకొని బుద్ధిమంతుల్లా ఉన్నాడు అనడంతో బుద్ధిమంతుడిలా కాదు బుద్ధిమంతుడే 24 క్యారెట్ బంగారం నీలా కాదు అని అంటుంది దివ్య. అప్పుడు దివ్యని ప్రేమ్ సరదాగా ఆట పట్టిస్తూ ఉండగా అమ్మ చూడమ్మా అనడంతో ఎందుకురా దాన్ని అంతలా ఏడిపిస్తావు అని అంటుంది తులసి. అప్పుడు అనసూయ చెల్లిని కాదు ఇంకెవరిని ఏడిపిస్తాడు అనడంతో మరి నేను అత్తారింటికి వెళ్ళాక ఎవరిని ఏడిపిస్తాడు అని అంటుంది దివ్య. ఆ మాటకు అందరు ఒక్కసారిగా ఎమోషనల్ అవుతారు. అప్పుడు దివ్య ప్రేమ్ నీ హత్తుకొని ఏడుస్తుంది. అప్పుడు మాధవి నేను కూడా అత్తారింటికి వెళ్లేటప్పుడు అన్నయ్య ఇలాగే వెక్కి వెక్కి ఏడ్చాడు అలా అని నన్ను అత్తారింటికి పంపించకుండా ఆపలేదు కదా అని అంటుంది.
బంధాలు సంతోష పెట్టడమే కాదు అప్పుడప్పుడు ఇలా ఏడిపిస్తుంటాయి అని అంటుంది మాధవి. అప్పుడు మాధవి మాటలకు అందరూ దిగులుగా కూర్చుని ఉంటారు. ఆ తర్వాత తులసి కిచెన్ లోకి వెళ్లడంతో అక్కడికి మాధవి వెళుతుంది. నేనేమైనా తప్పుగా మాట్లాడానా వదినా అనడంతో అదేం లేదు మాధవి అని అంటుంది. నువ్వు ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడావు పెళ్లయిన ఆడది అత్తవారింట్లో అతిధి లాంటిది తులసి బాధగా మాట్లాడుతుంది. అత్తారింట్లో ఒకప్పుడు ఉన్న ప్రేమ అనురాగాలు ఎప్పటికీ అలాగే ఉండాలి అనుకోవడం అత్యాశే అవుతుంది అని అంటుంది తులసి. వదిన నువ్వు ఏదో విషయం గురించి లోలోపల బాధ పడుతున్నావు బయటకు చెప్పడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావు కారణమేంటో తెలుసుకోవచ్చా అంటుంది మాధవి.
అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి నందు వచ్చి వారి మాటలు వింటూ ఉంటాడు. ఇంత వయసు వచ్చాక ఈ వయసులో నేను బాధపడడం కరెక్ట్ కాదే మో అది నాకు కూడా తెలుసు అని అంటుంది తులసి. కానీ నా మనసు ఊరుకోవడం లేదు నా చేతకానితనాన్ని ఎత్తి చూపిస్తోంది అని అంటుంది తులసి. నా పుట్టింటి విషయంలో, నా ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు పుట్టింటి వాళ్ళు పక్కన ఉండాలి అనుకోవడం తప్ప మాధవి అని అంటుంది. తప్ప మాధవి ఇది అత్యాశ అవుతుందా అని అడగగా అసలు కాదు వదిన అని అంటుంది. మరి పిలిచావా వదిన అనడంతో పిలిచాను పెళ్లికి వస్తామని చెప్పారు అని అంటుంది తులసి. అక్కడ కలుసుకుందాం అన్నారు అనడంతో ఆ మాటలు విన్న నందు ఎమోషనల్ అవుతాడు.
ఎందుకు రావడం లేదు వదినా అనగా ఏ ముఖం పెట్టుకొని రావాలి మాధవి ఈ ఇంట్లో వాళ్లకు ఎన్నో అవమానాలు జరిగాయి. ఆస్తులు లేకపోయినా ఆత్మ అభిమానం ఉంటుంది కదా. మీ అన్నతో నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా ఒకే ఇంట్లో కలిసి ఉన్నాం కాబట్టి వాటిని నేను భరిస్తాను కానీ వాళ్ళు భరించలేరు కదా మాధవి అని అంటుంది. అల్లుడుగా ఉన్నంతవరకు మీ అన్నయ్యని వాళ్లు భరించారు. బాధగా ఉన్న తప్పదు కాబట్టి గౌరవించారు. అల్లుడుగా సంబంధం తెగిపోయాక ఈ ఇంటితో మా అమ్మ వాళ్లకు ఎటువంటి సంబంధం ఉంటుంది చెప్పు అని తులసి బాధగా మాట్లాడడంతో ఆ మాటలు విన్న నందు కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఈ సమస్యకు పరిష్కారం లేదు మాధవి ఈ సమస్యను ఎవరికి చెప్పుకోలేను కూడా అని అంటుంది తులసి.
ఆ మాటలు విన్న నందు తనపై తానే కోపగించుకుంటూ ఎలా అయినా తులసి వాళ్ళ అమ్మ వాళ్ళని పిలుచుకు రావాలని అక్కడి నుంచి బయలుదేరుతాడు. అప్పుడు నందు దీపక్ వాళ్ళ ఇంటికి వెళ్లి ముందు బయట నిల్చోని లోపలికి రావచ్చా అని అడుగుతాడు. అప్పుడు దీపక్ వాళ్ళ అమ్మని పిలిచి అమ్మ లోపలికి రావచ్చా అడుగుతున్నారు ఏదో ఒకటి చెప్పు అడగడానికి అబద్దం నుంచి సిగ్గు లేకపోయినా చెప్పడానికి నాకు సిగ్గు ఉంది అని అంటుంది. అప్పుడు దీపక్ భార్య శ్రావణి అత్తయ్య ఏదైనా అనాల్సింది తిట్టాల్సింది ఉంటే లోపలికి పిలిచింది ఇలా గుమ్మం దగ్గర మంచిది కాదు అనడంతో అవన్నీ మా మధ్య ఎప్పుడో తెగిపోయాయి అని అంటుంది. అమ్మ నీ బాధ నాకు అర్థమైంది నీకు కోపం కూడా నాకు అర్థం అయింది.
బావని గుమ్మం దగ్గర నిలబెట్టాము అని తెలిస్తే అక్క చాలా బాధపడుతుంది అనగా ఆ ఒక్క మాట అడ్డుపెట్టుకొని ఆయన ఎన్ని అన్నా కూడా మనము అన్నీ మౌనంగా భరించాము అంటుంది. నువ్వు అవన్నీ మర్చిపోయిన నేను మాత్రం మర్చిపోలేదు దీపక్ అంటుంది దీపక్ వాళ్ళ అమ్మ. అప్పుడు నందు నేను తప్పులు చేసాను. క్షమించమని అడగడానికి వచ్చాను అత్తయ్య గారు అని అంటాడు. అత్తయ్య గారు అని పిలవకు నువ్వు అన్న మాటలు కంటే ఆ మాట నాకు చాలా బాధగా ఉంది అని అంటుంది సరస్వతి. నీలాంటి వారికి నా బిడ్డను కన్యాదానం చేసినందుకు నాకే అసహ్యంగా అనిపిస్తుంది అని అంటుంది. నీకు అయిదు నిమిషాలకు కేవలం 5కి నిమిషాలు సమయం మాత్రమే ఇస్తున్నాను అది కూడా కూతురు ముఖం గుర్తుకు వచ్చి ఈ లోపు నువ్వు లోపలికి వచ్చి చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపో అని అంటుంది సరస్వతి.
మరొకవైపు రాములమ్మ దివ్యని ఆటపటిస్తూ ఉంటుంది. ఏంటి దివ్య నా మీద కోపంగా ఉన్నావా అనడంతో ఆ మాట చెప్పడానికి కాల్ లిఫ్ట్ చేసాను అని అంటుంది. ఏంటి ఈ సమయంలో పెళ్లికూతురు చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని పెళ్ళికొడుకు ఫోన్ కాల్ కోసం ఎదురు చూడాలి కదా అని అంటాడు విక్రమ్. అప్పుడు విక్రమ్ దివ్యఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా నీకు ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశాను నాకు మూడు ఉత్సహం అన్ని పోయాయి అనడంతో ఇప్పుడు వాటిని తిరిగి తెప్పిస్తాను చూడు అంటూ దివ్య,విక్రమ్ కి ఫోన్ లో ముద్దు పెడుతుంది. అప్పుడు ఇంకొకటి అనడంతో ఇప్పుడే ఎక్కువ అడిగితే పెళ్లి తర్వాత మళ్ళీ స్టాక్ ఉండవు అని దివ్య ఆట పట్టిస్తూ ఉంటుంది. అప్పుడు విక్రమ్ నీకోసం ఒక గిఫ్ట్ పంపించాను ఏ సమయంలో అయినా ఇంటికి వస్తుంది దాని వెళ్లి తీసుకో అని చెప్పడంతో ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. అవునా అలా అయితే వెళ్లి ఫస్ట్ తీసుకో అది నీ చేతిలో కాకుండా ఎవరి చేతిలో పడిన కొట్లాటలే అని అంటాడు విక్రమ్.