ఒక్క హిట్ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉండే హీరోలు, హీరోయిన్ల సంఖ్య ఇండస్ట్రీలో చాలా ఎక్కువ. అలాంటి వారిలో సుధీర్ బాబు ఒకరు. హిట్‌లు ఫ్లాప్‌లు అని చూడకుండా మంచి మంచి కాన్సెప్ట్ లతో వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ స్థానం ఏర్పరచుకునే ప్రయత్నంలో ఉన్నాడు సుధీర్.
ఎన్ని ప్రయత్నాలు చేసినా సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు సుధీర్ బాబు. ఆయన నటించిన బ్లాక్ బస్టర్ హిట్ అంటే అది ప్రేమ కథా చిత్రం మూవీ ఒక్కటే అని చెప్పాలి. ఈసినిమాతో సుధీర్ బాబు మాత్రమే కాదు హీరోయిన్ గా నందిత రాజ్ కూడా స్టార్ అయ్యింది.