సరిగ్గా ఎలక్షన్స్ కి ముందు తేల్చేసిన తారకరత్న భార్య అలేఖ్య.. బాలయ్య గురించి ఎమోషనల్ పోస్ట్

Published : Apr 20, 2024, 02:16 PM IST

అలేఖ్యకి రాజకీయాలపై ఆసక్తి ఉందా.. ఆమె భవిష్యత్తులో పాలిటిక్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

PREV
16
సరిగ్గా ఎలక్షన్స్ కి ముందు తేల్చేసిన తారకరత్న భార్య అలేఖ్య.. బాలయ్య గురించి ఎమోషనల్ పోస్ట్

నందమూరి తారక రత్న ఫిబ్రవరి 22న గుండె సంబంధిత సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే.  అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే తారకరత్న ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉండేవారు. ఎలక్షన్ హీట్ పెరుగుతున్న సమయంలో తారకరత్న తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉండేవారు.  

26

కానీ కలలో కూడా ఊహించని విధంగా లోకేష్ పాదయాత్ర సమయంలో తారక రత్న కుప్పకూలడం.. ఆసుపత్రిలో కొన్ని రోజుల చికిత్స తర్వాత మరణించడం జరిగింది.  తారకరత్న మరణం తర్వాత ఆయన సతీమణి అలేఖ్య పిల్లల బాగోగులు చూసుకుంటూ ఒంటరిగా ఉంటున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఆమెకి వీలైనంత సపోర్ట్ ఉంది. 

36

మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని పార్టీలు ప్రచార కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నాయి. ఈ తారకరత్న తెలుగు దేశం పార్టీలో నాయకుడిగా ఎదగాలని ఆశపడ్డాడు. ప్రస్తుతం తారక రత్న లేకపోవడంతో ఆయన భార్య అలేఖ్య గురించి చర్చ వస్తోంది. 

46

అలేఖ్యకి రాజకీయాలపై ఆసక్తి ఉందా.. ఆమె భవిష్యత్తులో పాలిటిక్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ ఎన్నికల్లో ఆమె మద్దతు ఎవరికి అనే చర్చ కూడా జరుగుతోంది. 

56

దీని గురించి తాజాగా అలేఖ్య రెడ్డి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ ఎన్నికల గురించి ఆమె పరోక్షంగా ప్రస్తావిస్తూ.. నన్ను అందరూ నీ మద్దతు ఎవరికి అని అడుగుతున్నారు. నా మద్దతు ప్రేమ, మానవత్వం ఉన్న వైపే ఉంటుంది.ముఖ్యంగా నా కుటుంబం వైపే నా మద్దతు ఉంటుంది. 

66

నందమూరి బాలకృష్ణ, మోక్షజ్ఞ ఇద్దరూ తన పిల్లలతో కలసి ఉన్న ఫోటో షేర్ చేస్తూ తన మద్దతు బాలయ్య మావయ్యకే అని చెప్పింది. బాలయ్య మావయ్యకి అంతా మంచే జరగాలి. ఓబు(తారకరత్న), పిల్లలు, నేను మీపై ఎప్పుడూ అంతులేని ప్రేమ కురిపిస్తూనే ఉంటాం అంటూ పోస్ట్ చేసింది. 

Read more Photos on
click me!

Recommended Stories