మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఖరారు.. ముహూర్తం అప్పుడే.. కన్ఫమ్‌ చేసిన బెల్లంకొండ హీరో

Published : May 29, 2023, 09:05 PM ISTUpdated : May 29, 2023, 10:23 PM IST

మోక్షజ్ఞ సినిమాల్లోకి రావడం కష్టమే అని అభిమానులంతా ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో నందమూరి ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకునే వార్త  చెప్పాడు బెల్లంకొండ హీరో గణేష్‌. 

PREV
16
 మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఖరారు.. ముహూర్తం అప్పుడే.. కన్ఫమ్‌ చేసిన బెల్లంకొండ హీరో

నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గత నాలుగైదు ఏళ్లుగా దాగుడు మూతలుగా మారిపోయింది. అదిగో ఎంట్రీ, ఇదిగో ఏంటి, ఆ సినిమాతో ఎంట్రీ ఈ సినిమాతో ఎంట్రీ అంటూ వార్తలొచ్చాయి. బాలకృష్ణ కూడా తానే దర్శకత్వం వహిస్తానని తెలిపారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ లేదు. అడపాదడపా మీడియాకి కనిపించిన మోక్షజ్ఞ లావుగా, నీరసంగానే కనిపించాడు. కానీ ఆయన నటనకు ట్రైన్‌ అవుతున్నట్టు ఎప్పుడూ అనిపించలేదు. దీంతో అభిమానులు సైతం నిరాశ చెందుతూ వస్తున్నారు. 
 

26

ఇటీవల కాలంలో ఇక మోక్షజ్ఞ హీరోగా సినిమా ఎంట్రీ అనేది ఓ కలే అనే భావనకి వచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి అప్‌ డేట్‌ లేదు, హీరో అవుతాడో, లేదో తెలియదు, దీంతో అభిమానులు ఆశలు వదులుకున్నంత పనిచేశారు. దీనికితోడు మోక్షజ్ఞకి అసలు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదని, ఆయనకు బిజినెస్‌ వైపు ఆసక్తి ఉందని, కానీ బాలయ్య ఒత్తిడి తెస్తున్నాడనే ప్రచారం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో మోక్షజ్ఞ సినిమాల్లోకి రావడం కష్టమే అని ఓ నిర్ణయానికి వచ్చారు. 
 

36

ఈ క్రమంలో నందమూరి ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకునే వార్త  చెప్పాడు బెల్లంకొండ హీరో గణేష్‌. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. తాను, మోక్షజ్ఞ స్నేహితులమని వెల్లడించారు. కలిసి సినిమాలు కూడా చూసేవాళ్లమని, రామ్‌చరణ్‌ నటించిన `రచ్చ` సినిమాకి ఇద్దరం కలిసే థియేటర్‌కి వెళ్లామని, అది చూసిన ఫ్యాన్స్ బాలయ్య కొడుకు రామ్‌చరణ్‌ సినిమాకొచ్చాడని అభిమానులు గోల చేసినట్టు చెప్పారు బెల్లంకొండ గణేష్‌. 
 

46

అయితే ప్రస్తుతం సినిమాల్లోకి వచ్చేందుకు మోక్షజ్ఞ ప్రిపేర్‌ అవుతున్నాడట. నటన పరంగా ట్రైన్‌ అవుతున్నట్టు తెలిపారు. వచ్చే ఏడాది మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఉంటుందన్నారు. అతనిలో మంచి నటన ప్రతిభ ఉందని, కనుబొమ్మలతోనే నటించగలడని తెలిపారు. ఎన్టీఆర్‌, బాలయ్య తరహాలో ఆయనకు నటనా స్కిల్స్ ఉన్నాయని చెప్పారు. మంచి యాక్టర్‌ అవుతాడని, డాన్సు కూడా కలిసి చేశామని, బాడీలో మంచి ఈజ్‌ ఉందన్నారు. ఐబ్రోస్‌ నటిస్తాయని, డైలాగ్‌ చెప్పేటప్పుడు కనుబొమ్మలే మాట్లాడతాయని, అలాంటి ప్రత్యేకమైన టాలెంట్ ఉందన్నారు బెల్లంకొండ గణేష్‌. 

56
Mokshagna-Balakrishna

ఇదిలా ఉంటే బాలకృష్ణ ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో `ఎన్బీకే108` చిత్రంలో నటిస్తున్నారు. ఇది దసరాకి రానుంది. అనంతరం బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేయనున్నారు. ఇందులో మోక్షజ్ఞ కూడా నటిస్తారని తెలుస్తుంది. ఈ సినిమాలో కీలక పాత్రలో మోక్షజ్ఞ నటించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ సినిమా పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఉంటుందని, వచ్చే ఏపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారని, అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇది బాలయ్య బర్త్ డే సందర్భంగా జూన్‌ 10న ప్రారంభమవుతుందని సమాచారం. 

66

మరో వైపు నిర్మాత బెల్లంకొండ సురేష్‌ చిన్న కుమారుడు బెల్లంకొండ గణేష్‌ హీరోగా నటిస్తున్న `నేను స్టూడెంట్‌ సర్‌` సినిమా జూన్‌ 2న విడుదల కానుంది. అన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా సక్సెస్‌ కాలేకపోతున్నారు. తెలుగులో వరుస పరాజయాలు వెంటాడాయి. ఇటీవల బాలీవుడ్‌లో `ఛత్రపతి` రీమేక్‌తో తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేశారు. కానీ అది బెడిసి కొట్టింది. మరి గణేష్‌ అయినా సక్సెస్‌ అవుతాడా? అనేది చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories