విల్లులా శరీరాన్ని వంచుతూ.. అద్భుతమైన నటన, డాన్స్ స్టెప్పులతో .. డాన్స్ పెర్ఫామెన్స్ లతో అదరగొట్టే క్యూట్ బేబీ సాయి పల్లవి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆమెను చూసి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..? అవును ఆమెను చూసి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతలా ఇంప్రెస్ అవుతారు ఆమె గురించి తెలిస్తే..
సాయి పల్లవి రూటే సెపరేట్.. ఆమెకు వచ్చిన ఆఫర్లు.. కమర్షియల్ గా ఆలోచించి తీసుకుని ఉంటే.. ఇప్పటికి ఆమె రేంజ్ వేరే లెవల్లో ఉండేది. కాని అలా తీసుకోకపోయినా సరే.. సాయి పల్లవి ఇమేజ్ మాత్రం పెరిగిపోతూనే ఉంది. ఎంత పెద్ద స్టార్అయినా.. తనకు కథ నచ్చితేనే సినిమా చేస్తుంది సాయి పల్లవి. అది కూడా హీరోయిన్ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటేనే ఆ సినిమాలో నటిస్తుంది.
25
Sai Pallavi
సాయి పల్లవి అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. చాలామందికి ఆమె ఆదర్శం కూడా. డాక్టర్ చదువుకుంటూనే సినిమాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది బ్యూటీ. ఈమధ్య సినిమాలు తగ్గించింది చిన్నది. సినిమాలకు గుడ్ బై చెపుతుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కాని ఆమె మాత్రం ఈవిషయంలో ఏమాత్రం స్పందించలేదు. ఇక ఆమె గురించిబాలీవుడ్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
35
Sai Pallavi
సాయి పల్లవి గురించి బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వాఖ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సాయి పల్లవి అంటే తనకు చాలా ఇష్టమని, ఆమె తన క్రష్ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు గుల్షన్. ఆమె ఫోన్ నంబర్ తన వద్ద ఉన్నప్పటికి ఈ విషయాన్ని ఆమెతో చెప్పే ధైర్యం మాత్రం చేయలేకపోయాడట.
45
Gulshan Devaiah Sai pallavi
అంతే కాదు ఆమెతో నటించే అవకాశం వస్తే అది తన తన అదృష్టంగా బావిస్తానంటూ ఆమెపై తనకు ఉన్న ఇష్టాన్ని బయటపట్టేశాడు. సాయి పల్లవి అద్భుతమైన నటి, డ్యాన్సర్. ఆమె నటించిన సినిమాలు అన్నింటిని చూస్తాను. చాలా కాలం నుంచి ఆమెఅంటే ఇష్టం. కాని ఆ విషయం చెప్పలేను అంటూ కామెంట్స్ చేశాడు. ఆమె అంటే నాకు క్రష్ మాత్రమే. అంతకు మించి ఏమీ లేదని అనుకుంటున్నా అని అన్నారు గుల్షన్.
55
2010 నుంచి ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటున్నారు గుల్షన్. ది గర్ల్ ఇన్ ఎల్లో బూట్స్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. గతేడాది ‘బదాయ్ దో’ చిత్రంతో అలరించారు. ప్రస్తుతం ‘లవ్ ఎఫైర్’ తో పాటు మరో చిత్రంలో నటిస్తున్నారు.