అదే విధంగా కళ్యాణ్ రామ్ తన ఫ్యామిలీ విషయాలు, తండ్రి గురించి ఎమోషనల్ విషయాలు పంచుకున్నాడు. తన తొలి రెండు చిత్రాలు ఫ్లాప్ అయినప్పుడు తన తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది అని కళ్యాణ్ రామ్ అన్నారు. హీరోగా రాణిస్తున్న సమయంలో నిర్మాతగా కూడా సినిమాలు నిర్మించాలనిపించింది. కొత్త బ్యానర్ స్టార్ట్ చేయాలనుకున్నా. ఈ విషయాన్ని నాన్నగారికి చెప్పా.