ఎన్టీఆర్ గొప్ప నటుడు అని, మేమంతా నందమూరి బిడ్డలేమని, ఈరోజు నందమూరి ఫ్యామిలీ లెగసీ కంటిన్యూ అవుతుందంటే దానికి ఎన్టీఆర్ కూడా ఒక కారణమని పేర్కొన్నారు. ఎవరు ముందుకు వెళ్లినా, నందమూరి ఫ్యామిలీనే ముందుకు వెళ్తుందని, తమ్ముడు ఎన్టీఆర్ తీసుకెళ్లినా, అన్న కళ్యాణ్ రామ్ తీసుకెళ్లినా తనకు సంతోషమే అని చెప్పారు. ఎన్టీఆర్ సక్సెస్ చూసి ఒక అన్నగా ఎంతో సంతోషపడతానని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఆ వార్తలను ఇలా ఫుల్‌స్టాప్ పెట్టారు. తారకరత్న హీరోగా సక్సెస్ కాలేదు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారుతున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. మరోవైపు రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా మారుతున్నారు. కానీ రాజకీయాల్లో పాల్గొన్న ప్రారంభంలోనే అనారోగ్యానికి గురికావడం, దాదాపు 22 రోజులపాటు ఆనారోగ్యంతో పోరాడి శనివారం తుదిశ్వాస విడవడం అత్యంత బాధాకరం.