నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరకి బాగా ఇష్టమైన మూవీ గురించి ఓ స్టార్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూవీ ఫ్లాప్ అయినప్పటికీ ఆమెకి అదే ఇష్టం అని పేర్కొన్నారు.
నందమూరి బాలకృష్ణ చివరగా అఖండ 2 చిత్రంతో ప్రేక్షకులని పలకరించారు. అయితే అఖండ 2 నిరాశ పరిచింది. బాలయ్య అంటే మాస్ చిత్రాలకు పెట్టింది పేరు. మంచి మాస్ కథతో బాలయ్యతో సినిమా చేస్తే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవడం ఖాయం. మాస్ చిత్రాలతో టాలీవుడ్ లో తిరుగులేని గుర్తింపు పొందారు డైరెక్టర్ వివి వినాయక్.
25
వివి వినాయక్, బాలకృష్ణ కాంబినేషన్
వివి వినాయక్, బాలకృష్ణ కాంబినేషన్ లో చెన్నకేశవరెడ్డి చిత్రం తెరకెక్కింది. బాలకృష్ణ సతీమణి వసుంధరకి బాగా ఇష్టమైన సినిమా ఇదేనట. ఈ విషయాన్ని వి వి వినాయక్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. సినిమా నిరాశ పరిచినప్పటికీ వసుంధర గారికి ఈ మూవీ బాగా నచ్చింది. ఆమె నన్ను పిలిచి థాంక్స్ చెప్పారు. మూవీ చాలా బావుంది.
35
ఆయన ఎంతో సంతోషంగా ఉన్నారు
ఆయన్ని( బాలకృష్ణ) బాగా అందంగా చూపించారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు ఆయన ఎంతో సంతోషంగా ఉన్నారు అంటూ వసుంధర గారు నాతో చెప్పారు. అందరికీ సినిమా అంత బాగానచినప్పటికీ ఎందుకు నిరాశ పరిచింది అనేది పూర్తిగా అర్థం కాలేదు. బహుశా ఈ మూవీలో స్క్రీన్ ప్లే కొంత కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అదే కారణం అయి ఉండొచ్చు అని వినాయక్ తెలిపారు.
ఈ మూవీలో భూమిలో నుంచి సుమోలు పైకి లేచే సీన్ అప్పట్లో ఇండస్ట్రీ మొత్తానికి షాక్. ఎలాంటి టెక్నాలజీ లేని రోజుల్లో ఆ సీన్ ని రియలిస్టిక్ గా తీశాం. నన్ను దర్శకుడిగా అగ్ర హీరోలు గుర్తించింది ఆది సినిమా వల్ల కాదు..చెన్నకేశవ రెడ్డి మూవీలో సుమోల సీన్ వల్లే అని వినాయక్ తెలిపారు.
55
కొన్ని వందల కోట్ల బడ్జెట్
అలాంటి సన్నివేశాలతో ఇప్పుడు సినిమా చేయాలి అంటే కొన్ని వందల కోట్ల బడ్జెట్ ఖర్చు అవుతుంది అని వినాయక్ అన్నారు. ఆ ఒక్క సీన్ ని కేవలం 2 రోజుల్లో పూర్తి చేశాం. సినిమా మొత్తం 70 రోజుల్లో పూర్తి అయింది అని వినాయక్ అన్నారు.