బాలకృష్ణతోనే కాదు.. నందమూరి ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య కాస్త గ్యాప్ ఉందని ఫ్యాన్స్ చాలా కాలంగా భావిస్తున్నారు. ఆ విషయంలో చాలా రూమర్స్ కూడా ఉన్నాయి. కానీ సందర్భం వచ్చినప్పుడల్లా జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబ సభ్యులతో కలుస్తూనే ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ని బాలకృష్ణ చాలా సందర్భాల్లో అభినందించారు. అయితే తొలిసారి తారక్ నటనని బాలయ్య మెచ్చుకున్న సందర్భం ఒకటి ఉంది.