మహేష్ బాబు సినిమా కోసం రెండు లారీల మల్లెపూలు.. పాట మొత్తం పూలతో నింపిన దర్శకుడు ఎవరు..?

Published : Dec 07, 2024, 10:05 PM IST

సూపర్ స్టార్  మహేష్ బాబు కోసం రెండు లారీల మల్లెపూలు వాడారట ఓ స్టార్ డైరెక్టర్. ఓ పాట కోసం అన్ని మల్లెపూలు తెప్పించాడట దర్శకుడు. ఇంతకీ ఆ సినిమా ఏంటి..? ఎవరా దర్శకుడు, ఎంటా సినిమా..?   

PREV
14
మహేష్ బాబు సినిమా కోసం రెండు లారీల మల్లెపూలు.. పాట మొత్తం పూలతో నింపిన దర్శకుడు ఎవరు..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు చేస్తున్న సినిమాల లెక్క వేరు.. గతంలో చేసిన సినిమాల లెక్క వేరు.  ఇంతకు ముందు ఎలా ఉన్నా.. ఇప్పుడు మహేష్ సినిమాల్లో వేరియేషన్ ఈజీగా కనిపెట్టవచ్చు. ఇంతకు ముందు సినిమాల్లో మహేష్ బాబు గెటప్ కు ఇప్పుడు మహేష్ కు చాలా తేడా ఉంది. అయితే మహేష్ సినిమాల కోసం దర్శకులు చాలా ప్రయోగాలు చేశారు. 
 

24
Murari

కాని అందులో కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి. మరికొన్ని కనిపించకుండా పోయాయి. మహేష్ బాబు మురారీ, ఒక్కడు, టక్కరిదొంగ.. సైనికుడు, అతిధి లాంటి ఇలా సినిమా సినిమాకు చాలా డిఫరెంట్ గా కనిపించేవాడు. అయితే ఆయన చేసిన సినిమాల్లో డిఫరెంట్ ఫ్యామిలీ సబ్జెక్ట్ లలో మురారి ఒకటి. ఈసినిమా మహేష్ కెరీర్ లోనే అద్భుతం అని చెప్పాలి. ఇలాంటి క్యారెక్టర్ ఆయన చేయడం అదే మొదటి సారి. 
 

34

అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఆదరించారు సినిమాను. కుటుంబం అంతా కలిసి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది మురారి సినిమా. ఫ్యామిలీ ఎమోషన్స్ అందరిని కంటతడి పెట్టిస్తాయి.  అయితే ఈసినిమాలో ప్రతీ సీన్, ప్రతీ సాంగ్, ప్రతీ ప్రాపర్టీ ఓ అద్భుతమైన ఆర్ట్ లా అనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు కోసం రెండు లారీల పూలు వాడిన సందర్భం ఒకటి ఉందట. 

44

ఆ సందర్భమేంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమాలో అందరికి చాలా ప్రత్యేకమైనది పెళ్ళి పాట. మరీముఖ్యంగా పెళ్లి పాట తరాల పాటు నిలిచిపోయేలా డైరెక్ట్ చేశారు కృష్ణవంశీ.  ఈ పాట ఎంత అద్భుతంగా ఉంటుందో అందరికి తెలుసు. అయితే ఈ పాట కోసం ఏకంగా రెండు లారీల మల్లెపూలువాడారట దర్శకుడు. ఈ విషయాన్ని ఓ సందర్భంలో కృష్ణవంశీ చెప్పుకొచ్చారు. 


ఆసినిమా ఆ టైమ్ లో సూపర్ హిట్ అయ్యింది. మహేష్ బాబు ఇన్నోసెంట్ గా ఉంటూ.. హీరోయిజం చూపించడం. సోనాలి బింద్రే అచ్చతెలుగు ఆడపిల్లలా ఆమెనటనతో అలరించడం ఈసినిమాకు ప్లాస్ అయ్యింది. అంతే కాదు ఫ్యామిలీ సెంటిమెంట్ తో పాటు ఎమోషనల్ పాయింట్స్ ఈమూవీకి బాగా కలిసి వచ్చాంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories