అదిరిపోయిన బాలయ్య న్యూ లుక్.. ‘ఆహా’ కోసం మరింత స్టైలిష్ గా నందమూరి నటసింహాం.. వైరల్ పిక్స్!

First Published | Mar 14, 2023, 4:50 PM IST

నందమూరి నటసింహాం బాలయ్య (Balakrishna) కొత్త లుక్  నెట్టింట వైరల్ గా మారింది.  ‘ఆహా’లో ప్రారంభం కానున్న సింగింగ్ షో కోసం స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం పిక్స్ వైరల్ గా మారాయి. 

వెండితెర అయినా.. బుల్లితెర అయినా ఒక్కసారి బాలకృష్ణ దిగనంత వరకే.. వన్స్ బాలయ్య అడుగుపెట్టడంటే రికార్డులు బద్దలు కావాల్సిందే. ఇది కేవలం డైలాగ్ వరకే కాకుండా.. నిజంగా బాలయ్య చేసి చూపించారు. కొందరు గిట్టని వారి కామెంట్లకు  ‘అఖండ’, ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’,‘వీరసింహారెడ్డి’తో గట్టి సమాధానం చెప్పారు. దీంతో ప్రస్తుతం బాలయ్య క్రేజ్ మాములుగా లేదు. 
 

టాలీవుడ్ సీనియర్ నటుడు నందమూరి  బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెండితెరపై ఎన్నో గుర్తుండిపోయే చిత్రాల్లో నటించి చెరగని ముద్ర వేసుకున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్థాపించిన ‘ఆహా’లో Unstoppable with NBK రెండు సీజన్లతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. పెద్ద స్టార్స్ తో చాలా సరదగా.. యంగ్ స్టార్స్ తో ట్రెండ్ కు తగ్గట్టుగా ఉండి.. ఇండియాలోనే నెంబర్ టాక్ షోగా మార్చారు. 


రీసెంట్ గానే ‘అన్ స్టాపబుల్’ సెకండ్ ఎపిసోడ్ కూడా ముగింది. ఇక ‘ఆహా’ కోసం మరో కొత్త అవతారంలో అలరించబోతున్నారు బాలయ్య. రెండ్రోజుల్లో ప్రారంభం కానున్న Telugu Indian Idol Season 2లో మెరియబోతున్నారు. ఇప్పటికే మొదటి సీజన్ లో గెస్ట్ జడ్జీగా హాజరై ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 

మళ్లీ ఆయన ఎంట్రీతోనే సెకండ్ సీజన్ ను ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం బాలయ్య అదిరిపోయే లుక్ లోకి మారిపోయారు. సీజన్ 2 లాంచ్ సందర్భంగాలో అదిరిపోయే డాన్స్ పెర్ఫామెన్స్ ఇవ్వబోతున్నట్టు ‘ఆహా’ తాజాగా ప్రకటించింది. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తైనట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా వదిలారు. 

ఈ ఫొటోల్లో బాలయ్య స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. చాలా ఎనర్జిటిక్ గా, స్టైలిష్ లుక్ లో యంగ్ డాన్సర్స్ తో కలిసి పెర్ఫామ్ చేయబోతున్నట్టు పిక్స్ చెబుతున్నాయి. బాలయ్య న్యూ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మార్చి 17 మరియు 18న షో ప్రారంభం కానుందని.. ఈ సందర్భంగా మునుపెన్నడూ చూడని బాలయ్యను చూస్తారని ‘ఆహా’ చెప్పడంతో ఆసక్తి పెరుగుతోంది. 

ఇప్పటికే ‘తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2’ కాంపిటీషన్ కోసం 12 మందిని కంటెస్టెంట్స్ ను ఎంపిక చేశారు. వారందరినీ షో ప్రారంభం రోజున పరిచయం చేయబోతున్నారు. షోకు జడ్జీగా ఎస్ థమన్, సింగర్స్ కార్తీక్, గీతామాధురి వ్యవహరిస్తున్నారు. శ్రీరామ చంద్ర హోస్ట్ గా షో కొనసాగునుంది.  బాలయ్య అపియరెన్స్ తో షోకు మంచి ఆదరణ దక్కనుంది. 

Latest Videos

click me!