విజయశాంతి, రమ్యకృష్ణ, సిమ్రాన్ తన కి ఇష్టమైన హీరోయిన్లు అని బాలయ్య పేర్కొనడం విశేషం. వీరి ముగ్గురితో బాలయ్య అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. విజయశాంతితో బాలయ్య లారీ డ్రైవర్, ముద్దుల మావయ్య, రౌడీ ఇన్స్పెక్టర్, మువ్వా గోపాలుడు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఇక రమ్యకృష్ణతో బంగారు బుల్లోడు, దేవుడు, వంశానికొక్కడు లాంటి చిత్రాల్లో నటించారు.