Ibomma: ఓటీటీలో రిలీజ్ కాగానే డాకు మహారాజ్ హంగామా షురూ, దానిని అడ్డుకోలేక దిల్ రాజు కూడా చేతులెత్తేశారా

Published : Feb 21, 2025, 01:08 PM IST

Ibomma: మరో సంక్రాంతి చిత్రం కూడా ఓటీటీలోకి వచ్చేసింది. బాలయ్య నటించిన డాకు మహారాజ్ చిత్రం ఫిబ్రవరి 21 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలైంది. డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. 

PREV
14
Ibomma: ఓటీటీలో రిలీజ్ కాగానే డాకు మహారాజ్ హంగామా షురూ, దానిని అడ్డుకోలేక దిల్ రాజు కూడా చేతులెత్తేశారా
Daaku Maharaaj, Dil Raju

సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో గేమ్ ఛేంజర్ ముందుగా ఓటీటీలో రిలీజ్ అయింది. ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. థియేటర్స్ లో ఈ మూవీ డిజాస్టర్ కావడంతో ఓటీటీలోకి ఈ చిత్రాన్ని ముందుగా తీసుకువచ్చారు. ఇప్పుడు మరో సంక్రాంతి చిత్రం కూడా ఓటీటీలోకి వచ్చేసింది. బాలయ్య నటించిన డాకు మహారాజ్ చిత్రం ఫిబ్రవరి 21 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలైంది. 

 

24

డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. బాలయ్యకి వరుసగా నాలుగో హిట్ గా నిలిచింది. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు డాకు మహారాజ్ నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. రాగానే ఈ మూవీ ట్రెండింగ్ గా మారింది. పైరసీ వెబ్ సైట్లు కూడా ఈ చిత్రం కోసం కాచుకుని ఉన్నాయి. 

 

34

డాకు మహారాజ్ ఓటీటీలోకి వచ్చిందో లేదో అప్పుడే  టొరెంట్ వెబ్ సైట్ ఐబొమ్మలో లీక్ అయిపోయింది. అంతే కాదు ఐబొమ్మలో డాకు మహారాజ్ టాప్ లో ట్రెండ్ అవుతోంది. పైరసీ వెబ్ సైట్లు ఓటిటి ఆదాయానికి కూడా గండి కొడుతున్నాయి.దీని గురించి గతంలో మీడియా ప్రతినిధి దిల్ రాజుని ప్రశ్నించారు. దిల్ రాజు టాలీవుడ్ లో అగ్ర నిర్మాత మాత్రమే కాదు  తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఉన్నారు. 

 

44

ఐబొమ్మ లాంటి పైరసీ సైట్స్ పై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అని మీడియా ప్రశ్నించగా దిల్ రాజు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా చేతులెత్తేశారు. దానిని అరికట్టడం తన ఒక్కడి వల్ల సాధ్యం కాదని, ఫిలిం ఛాంబర్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని దిల్ రాజు గతంలో తెలిపారు. 

 

Read more Photos on
click me!

Recommended Stories