నందమూరి బాలకృష్ణ ఒకసారి తన జాతకానికి విరుద్ధంగా ప్రవర్తించారట. పెద్ద ప్రమాదం జరిగిందట. అసలు బాలకృష్ణ ఏం చేశారు ? ఆయనకి ఎదురైన గండం ఏంటి అనేది ఈ కథనంలో తెలుసుకోండి.
నందమూరి బాలకృష్ణ అఖండ నుంచి డాకు మహారాజ్ వరకు వరుస సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఆ తర్వాత బాలయ్య బోయపాటి దర్శకత్వంలో నటించిన అఖండ 2 డిజాస్టర్ అయింది. ప్రస్తుతం బాలయ్య పలువురు దర్శకులతో చర్చలు జరుపుతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక చిత్రం చేయాల్సి ఉంది.
25
ప్రతిదీ ముహూర్తం ప్రకారం
బాలకృష్ణకి జాతకాలపై, ఆస్ట్రాలజీ పై అమితమైన విశ్వాసం ఉంది. ప్రతిదీ బాలయ్య ముహూర్తం ప్రకారం చేస్తారు. ప్రతిరోజు తెల్లవారు జామున బాలయ్య పూజ చేసుకుంటారు. బాలకృష్ణ ఒకరోజు తన జాతకానికి విరుద్ధంగా ప్రవర్తించడం వల్ల తనకు గండం ఎదురైంది అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
35
బ్లాక్ డ్రెస్ వేసుకున్నా
బాలకృష్ణ మాట్లాడుతూ నాది మూల నక్షత్రం. కాబట్టి నేను ఆదివారాల్లో నల్లటి దుస్తులు ధరించకూడదు. కానీ ఆదిత్య 369 షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆదివారం రోజు బ్లాక్ డ్రెస్ వేసుకున్నా. నాకు ఏదో నెగిటివ్ గా జరగబోతోంది అని అర్థం అవుతోంది. కానీ పట్టించుకోలేదు. ఆ సినిమాకు లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఒక నిర్మాత.
ఆయన ఎప్పుడూ షూటింగ్ లొకేషన్ కి రాలేదు. ఆరోజు వచ్చారు. ఆయన వచ్చినప్పుడే నేను కాలు జారి కింద పడ్డాను. నడుముకు ఫ్రాక్చర్ కావడంతో సర్జరీ జరిగింది. పెద్ద గండం తప్పింది. తాను షూటింగ్ కి రావడం వల్లే అలా జరిగింది అని బాలుగారు లొకేషన్ నుంచి వెళ్లిపోయారు. ఇంకెప్పుడూ షూటింగ్ కి రాలేదు అని బాలయ్య గుర్తు చేసుకున్నారు.
55
ఇంకెప్పుడూ బ్లాక్ డ్రెస్ ధరించలేదు
ఆ తర్వాత ఇంకెప్పుడూ తాను ఆదివారం రోజు బ్లాక్ డ్రెస్ ధరించలేదు అని బాలయ్య తెలిపారు. ఈ విధంగా ఆస్ట్రాలజీలో బాలయ్యకి కొన్ని బలమైన నమ్మకాలు ఉన్నాయి.