Prasad Behera: ఇంతకన్నా నన్ను పీకేది ఏమీ లేదు.. ఆవేదనతో నటుడు ప్రసాద్ బెహరా తీవ్ర వ్యాఖ్యలు

Published : Apr 16, 2026, 06:42 PM IST

ప్రముఖ యూట్యూబర్, నటుడు ప్రసాద్ బెహరా ఇటీవల పాపం ప్రతాప్ మూవీ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదం అవుతున్నాయి. మీడియాని ఉద్దేశిస్తూ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

PREV
15
Prasad Behera

ప్రసాద్ బెహరా యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు టాలీవుడ్ లో నటుడిగా రాణిస్తున్నాడు. కమిటీ కుర్రోళ్ళు చిత్రంలో కీలక పాత్రలో నటించి మెప్పించాడు. అయితే ప్రసాద్ బెహరాపై వివాదాలు కూడా ఉన్నాయి. గతంలో ప్రసాద్ బెహరా యూట్యూబర్ గా ఉన్నప్పుడు అతడితో కలసి పని చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లు యన్సర్ కంచన్ బమ్మె అనే అమ్మాయి అతడిపై కేసు నమోదు చేసింది.

25
ప్రసాద్ పై కేసు

తనని లైంగికంగా వేధిస్తున్నాడు అనే ఆరోపణలతో ప్రసాద్ పై కేసు పెట్టింది. ఈ వివాదంలో ప్రసాద్ బెహరా అరెస్ట్ కావడం, ఆ తర్వాత బయటకి వచ్చి తిరిగి తన కెరీర్ కొనసాగించడం జరిగింది. అయితే ఇటీవల ఓ ప్రముఖ మీడియా సంస్థ ప్రసాద్ బెహరా వివాదాన్ని మళ్ళీ తెరపైకి తీస్తూ మగాడు కాదు మృగాడు అనే టైటిల్ తో కథనం ప్రచురించారు.

35
ఏం రాసినా ఏడ్చేవాడు ఎవడూ లేడు

దీనితో ప్రసాద్ బెహరా బాగా హర్ట్ అయ్యాడు. తాను నటించిన లేటెస్ట్ మూవీ పాపం ప్రతాప్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆవేదన భరించలేక బరస్ట్ అయ్యాడు. ఈ క్రమంలో మీడియాపై కొన్ని తీవ్ర వ్యాఖ్యలు, సెటైర్లు వేశాడు. ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. వాస్తవానికి ఈ ఈవెంట్ కి నేను రాలేని పరిస్థితి. కానీ మీడియా మిత్రులతో ఎలాగైనా మాట్లాడాలి అని ఇక్కడకు వచ్చాను. మీడియా మిత్రులకు చెబుతున్నా. నా గురించి రాసుకోండి. మీరు ఏం రాసినా ఏడ్చేవాడు ఎవడూ లేడు. మా అమ్మకి యూట్యూబ్ లింక్ పంపితే దానిని ఓపెన్ చేయడం కూడా ఆమెకి తెలియదు.

45
డబ్బు కోసం అమ్మాయిల వద్దకు

నా గురించి మీరు ఏమైనా రాసుకోండి. వీడు మగాడు కాదు మృగాడు. ఈ సినిమాకు వీడు కీలకం కాదు కీటకం. వీడొక స్లీపర్ సెల్. పాకిస్తాన్ తో వీడికి సంబంధాలు ఉన్నాయి.. ఇలా నా గురించి ఏమైనా రాసుకోండి. ఇటీవల నాపై ఒక మచ్చ పడింది. దాని నుంచి బయటపడి మళ్ళీ గెలుద్దాం అని వచ్చా. నువ్వు మరచిపోతే ఎలా మేము గుర్తు చేస్తాం అంటూ మీరు నా గురించి రాస్తున్నారు. డబ్బు కోసం అమ్మాయిల వద్దకు వెళతా అని కూడా రాసుకోండి. కానీ వేరే ఆడపిల్లల పేర్లు మధ్యలోకి తీసుకురాకండి.

55
నన్ను పీకేది ఏమీ లేదు

మీరు నా తల్లిదండ్రులని కూడా మార్చేశారు. దయచేసి అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే నా కర్మ. ఇంతకన్నా నన్ను పీకేది ఏమీ లేదు అంటూ ప్రసాద్ బెహరా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే సదరు ఛానల్ ప్రసారం చేసిన కథనంలో కంచన్ బమ్మె ఫోటో కాకుండా మరొక అమ్మాయి ఫోటో వేశారు. అంటే ఈ అమ్మాయిని కూడా ప్రసాద్ వేధించాడా అనే చర్చ మొదలైంది. అయితే ఈ అమ్మాయి ప్రస్తుతం ప్రసాద్ తో కలసి యూట్యూబ్ లో సిరీస్ లు చేస్తోంది. వీళ్లిద్దరి మధ్య ఎలాంటి వివాదం లేదని సమాచారం. ఈ వార్తలతో ఆ అమ్మాయి కూడా షాక్ అయిందట.

Read more Photos on
click me!

Recommended Stories