Mahesh Namrata: సినిమాలు మానేసే ముందు మహేష్ కి నమ్రత పెట్టిన కండిషన్ ఇదే.. భయంతోనే రిక్వస్ట్ చేసిందట

Published : Mar 10, 2026, 08:00 AM IST

Mahesh Namrata: పెళ్లి తర్వాత మహేష్ కి తాను ఒక విచిత్రమైన కండిషన్ పెట్టినట్లు నమ్రత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అదే విధంగా తాను సినిమాలకు దూరం కావడానికి కారణం ఏంటో కూడా తెలిపారు. ఆ కండిషన్ ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
మహేష్ బాబు, నమ్రత ప్రేమ వివాహం

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవడం అప్పట్లో టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. పెళ్లి తర్వాత నమ్రత పూర్తిగా సినిమాలు మానేసింది. తెలుగులో ఆమె నటించింది కేవలం 2 సినిమాల్లో మాత్రమే.

25
తెలుగులో 2 సినిమాలు మాత్రమే

ఒకటి మహేష్ బాబుతో వంశీ మూవీ కాగా మరొకటి మెగాస్టార్ చిరంజీవితో అంజి మూవీ. ఈ రెండు చిత్రాలు డిజాస్టర్స్ అయ్యాయి. పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు దూరమయ్యారు. కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు ఇలా చేయడానికి కారణం ఏంటి అని అడుగగా నమ్రత ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

35
ఇద్దరం చాలా క్లియర్ గా ఉన్నాం

ఆ విషయంలో మహేష్, నేను చాలా క్లియర్ గా ఉన్నాం. తనకి నాన్ వర్కింగ్ ఉమెన్ భార్యగా ఉండాలి అని మహేష్ కోరుకున్నాడు. సినిమాలు మాత్రమే కాదు ఏ ప్రొఫెషన్ లోనూ పని చేయని అమ్మాయి భార్యగా కావాలి అని మహేష్ భావించాడు. మహేష్ నిర్ణయాన్ని నేను గౌరవించాను.

45
భయంతో ఆ కండిషన్ పెట్టా

అదే విధంగా మహేష్ కూడా నా కోరికలని అర్థం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత పెద్ద బంగ్లాలో ఉండడం నాకు ఇష్టం లేదు. నేను ముంబైలో అపార్ట్మెంట్ కల్చర్ లో పెరిగాను. సడెన్ గా పెద్ద బంగ్లా అంటే నాకు చాలా భయంగా అనిపించింది. కొంత కాలం అపార్ట్మెంట్ లో ఉందాం అని అడిగా. నా కోసం మహేష్ అపార్ట్మెంట్ కి మూవీ అయ్యాడు అని నమ్రత తెలిపారు.

55
మహేష్ ని మాట్లాడించింది నేనే

మహేష్ ని ప్రేమించడానికి ముందు అతడు చాలా ఇంట్రావర్ట్ గా, రిజర్వ్డ్ గా కనిపించేవాడు. నేనే కలుగజేసుకుని మాట్లాడేదాన్ని అని నమ్రత పేర్కొంది. నమ్రత గతంలో మోడలింగ్ కూడా చేశారు. ఆమె మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories