ఏదో పొరపాటున అనేశాడు అని ఊరుకోవడం లేదు. వీరసింహారెడ్డి విజయోత్సవ వేడుకలో బాలయ్య ఎస్వీ రంగారావు గారిని, ఏఎన్నార్ గారిని అగౌరవ పరిచేలా కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రంగారావు ఈ రంగారావు.. అక్కినేని తొక్కినేని అంటూ నోరు జారారు. ఇది పెద్ద వివాదం కావడంతో అక్కినేని ఫ్యామిలీ నుంచి ఆయన మనవళ్లు గా నాగ చైతన్య, అఖిల్ స్పందించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రెస్ నోట్, సోషల్ మీడియా పోస్ట్ లద్వారా బాలయ్య వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించారు.