సాడ్‌ ఎండింగ్‌ ఆడియెన్స్ చూస్తారా?.. నాగార్జున పెద్ద రిస్కే చేస్తున్నాడు..

Published : Jan 06, 2024, 06:07 PM IST

నాగార్జున హీరోగా రూపొందుతున్న `నా సామి రంగ` చిత్రం సంక్రాంతికి రాబోతుంది. కానీ ఈ మూవీని సాడ్‌ ఎండింగ్‌ భయపెడుతుంది. నాగ్‌ పెద్ద రిస్క్ చేస్తున్నాడా?

PREV
17
సాడ్‌ ఎండింగ్‌ ఆడియెన్స్ చూస్తారా?.. నాగార్జున పెద్ద రిస్కే చేస్తున్నాడు..

టాలీవుడ్‌ మన్మథుడు.. సినిమాల పరంగా వరుస ఫెయిల్యూర్స్ ఉన్నా, ఆయన జోరు మాత్రం నెక్ట్స్ లెవల్‌ అని చెప్పొచ్చు. దీనికి కారణం బిగ్‌ బాస్‌ 7 షో. ఇది ఈ సారి పాపులర్‌ కావడం, అత్యధికంగా రేటింగ్‌ రావడం, చివరకు వివాదంగా మారడమే. అంతేకాదు నాగార్జునకి కూడా ఆ క్రేజ్‌ యాడ్ అయ్యింది. ఆయన హోస్ట్ గా వ్యవహరించిన తీరు కూడా ప్లస్‌ అయ్యింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న `నా సామి రంగ` చిత్రంపై ఆ ప్రభావం కనిపిస్తుంది. ఈ మూవీకి ఉన్న హైప్‌ అందుకు కారణంగా చెప్పొచ్చు.  
 

27

ప్రస్తుతం నాగార్జున హీరోగా నటిస్తున్న `నా సామి రంగ` చిత్రానికి కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఓ రకంగా ఇదొక కొత్త రకమైన మల్టీస్టారర్ చిత్రమని చెప్పొచ్చు. ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతుంది. భారీ పోటీ మధ్య ఈ మూవీ సంక్రాంతి పందెంకోడిగా బరిలోకి దిగబోతుంది. 
 

37
Naa Saami Ranga joju george

Naa Saami Ranga joju george

47
Nagarjuna

`నా సామి రంగ` మలయాళ మూవీకి రీమేక్‌. మలయాళంలో విజయం సాధించిన `పొరింజు మరియమ్‌` అనే మూవీని తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. ఈ కథపైనే రైటర్‌ బెజవాడ ప్రసన్న కుమార్‌ వర్క్ చేశాడు. దర్శకుడిగా మారాలనుకున్నాడు. కానీ ఆయన ఈ సినిమాని స్ట్రెయిట్‌ మూవీగా చెప్పాడు. కానీ రీమేక్ అని తెలిసి ఆయన్ని పక్కన పెట్టాడు నాగ్‌. కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నీకి ఈ బాధ్యతలు అప్పగించాడు. టీజర్, పాటలను బట్టి చూస్తే ఈ మూవీ బాగానే వచ్చిందని తెలుస్తుంది. నాగార్జున కూడా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. 
 

57
Naa Saami Ranga Teaser

సినిమా  1965-1985 మధ్యలో సింపుల్ పీరియాడిక్ లవ్ స్టోరీగా నడుస్తుంది. ఇక సినిమాలో కామెడీ ప్లస్ అయింది. అయితే సినిమాలో ఉన్న ట్విస్ట్ ఏంటంటే, మాతృకలో క్లైమాక్స్ లో హీరో చనిపోతాడు. మెయిన్‌ లీడ్‌లో ఉన్న రెండు పాత్రలు చనిపోతాయి. మరి తెలుగులోనూ అలానే చేసే నాగార్జున, అల్లరినరేష్‌ పాత్రలు చనిపోతాయి. మరి అలానే చేస్తున్నారా? మార్చుతున్నారా? అనేది డౌట్‌. అలానే చేస్తే మాత్రం పెద్ద రిస్క్‌ అనే చెప్పాలి. ఎందుకంటే మన తెలుగులో సాడ్‌ ఎండింగ్‌ సినిమాలను ఆడియెన్స్ ఎంకరేజ్ చేయరు. చాలా వరకు అలాంటి మూవీస్‌ పరాజయం చెందినవే ఎక్కువగా ఉన్నాయి.

67

నాగార్జున నటించిన `స్నేహమంటే ఇదేరా` చిత్రంలో నాగ్‌ చివర్లో చనిపోతాడు. ఇది కూడా సాడ్‌ ఎండింగ్‌. ఆ మూవీ డిజాస్టర్ అయ్యింది. దీంతో ఇప్పుడు `నా సామిరంగ` మూవీ కూడా అలాంటి సెంటిమెంట్‌తోనే వస్తుంది.  ఆ సాడ్‌ ఎండింగ్‌ సెంటిమెంట్‌  భయపెడుతుంది. మలయాళంలో కంటెంట్‌కి ప్రయారిటీ ఇస్తారు, అక్కడ నడిచిపోయింది. కానీ తెలుగులో అలా ఉండదు. ఫ్యాన్స్ ఇలాంటి వాటిని తీసుకోలేరు. అదే ఇప్పుడు `నా సామి రంగ`ని టెన్షన్‌ పెడుతుంది. చిత్ర బృందాన్ని కలవరపెడుతుంది. ఫ్యాన్స్ ని ఆందోళనకి గురి చేస్తుంది. నాగార్జున పెద్ద రిస్కే చేస్తున్నాడని అంటున్నారు. 
 

77

అసలే ఆయన గత చిత్రాలు డిజప్పాయింట్‌ చేశాయి. సోలోగా హిట్ లేదు. `సోగ్గాడే చిన్న నాయన` వంటి సక్సెస్‌ రాలేదు. అలాంటి హిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాడు. కానీ వర్కౌట్‌ కావడం లేదు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఇలాంటి రిస్క్ అవసరమా అనే వాళ్లు కూడా ఉన్నారు. దీనికితోడు రీమేక్‌ సినిమాలు వర్కౌట్‌ కావడం లేదు. గత రెండేళ్లలో చాలా సినిమాలు ఫెయిల్‌ అయ్యాయి. తెలుగులోనే అది జరిగింది. ఇది కూడా మరో పెద్ద రిస్క్. ఈ రెండు రిస్క్ ల మధ్య నాగ్‌ `నా సామి రంగ` అంటూ ఈ సంక్రాంతికి వస్తున్నారు.  
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories