కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, హరికృష్ణ లని టైగర్, సింహాలతో పోల్చిన నాగార్జున.. బాలయ్యని మాత్రం

Published : Dec 18, 2023, 10:06 AM ISTUpdated : Dec 18, 2023, 10:07 AM IST

మాస్ మహారాజ్ రవితేజ, నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్, అల్లరి నరేష్, సుమ కనకాల, రాజ్ తరుణ్ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే లో సందడి చేశారు. కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా తమ డెవిల్ చిత్ర ప్రమోషన్స్ కోసం హాజరయ్యారు. 

PREV
16
కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, హరికృష్ణ లని టైగర్, సింహాలతో పోల్చిన నాగార్జున.. బాలయ్యని మాత్రం

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తూ 106 రోజుల పాటు అలరించిన బిగ్ బాస్ సీజన్ 7 ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. సామాన్యుడు తొలిసారి బిగ్ బాస్ టైటిల్ కైవసం చేసుకోవడంతో ప్రశాంత్ కి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

 

26
Bigg Boss Telugu 7

దాదాపు నాలుగు గంటలు సాగిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి పలువురు సెలబ్రిటీలు అతిథులుగా హాజరయ్యారు. మరికొందరు హీరోయిన్లు తమ డ్యాన్స్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. మాస్ మహారాజ్ రవితేజ, నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్, అల్లరి నరేష్, సుమ కనకాల, రాజ్ తరుణ్ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే లో సందడి చేశారు. 

 

36

కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా తమ డెవిల్ చిత్ర ప్రమోషన్స్ కోసం హాజరయ్యారు. బిగ్ బాస్ హౌస్ లో డెవిల్ విశేషాలని కళ్యాణ్ రామ్ నాగార్జునకు వివరించారు. అలాగే డెవిల్ ట్రైలర్ ని కూడా ప్రదర్శించారు. ట్రైలర్ అద్భుతంగా ఉండగా నాగార్జున కళ్యాణ్ రామ్ ని అభినందించారు. హరికృష్ణ కుటుంబంలో నాగార్జున చాలా క్లోజ్. ఇద్దరూ కలసి సీతారామరాజు అనే చిత్రంలో నటించారు. 

 

46

అప్పటి నుంచి నాగార్జున హరికృష్ణని తన అన్నయ్యగానే సోదరభావంతో చూస్తారు. అయితే బిగ్ బాస్ ఫినాలేలో నాగార్జున డెవిల్ ట్రైలర్ చూశాక చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. డెవిల్ ట్రైలర్ చివర్లో విశ్వాసంగా ఉండడానికి కుక్కననుకున్నావు రా.. లయన్ అంటూ కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ గా చెప్పే డైలాగ్ ఉంటుంది. 

 

56

నాగార్జున మాట్లాడుతూ.. నాకు తెలిసిన టైగర్ అన్నయ్య హరికృష్ణ.. ఆ తర్వాత నువ్వు.. ఆ తర్వాత తారక్ అని నాగార్జున అన్నారు. తారక్ యంగ్ టైగర్ అని కళ్యాణ్ రామ్ సమాధానం ఇచ్చాడు.ఇప్పుడు నువ్వు లయన్ అంటూ నాగ్ అభినందించారు. నాగార్జున చేసిన వ్యాఖ్యలు నందమూరి అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. నాగార్జున, బాలకృష్ణ మధ్య విభేదాలు ఉన్నాయనేది చాలా రోజులుగా జనాల్లో ఉన్న రూమర్. 

 

66

హరికృష్ణ కుటుంబాన్ని సింహాలతో, పులులతో నాగ్ పోల్చాడు కానీ బాలయ్య ప్రస్తావన మాత్రం రాలేదు. నందమూరి ఫ్యామిలిలో సింహం అంటే అభిమానులకు గుర్తుకు వచ్చేది బాలయ్యే. కానీ నాగార్జున తెలివిగా తనకి బాగా సాన్నిహిత్యం ఉన్న హరికృష్ణ కుటుంబాన్ని మాత్రమే ప్రస్తావించాడు. అక్కడ బాలయ్య గురించి చర్చ రాకపోయినా అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో నాగార్జున, బాలకృష్ణ గురించి మరోసారి మాట్లాడుకుంటున్నారు. 

 

Read more Photos on
click me!

Recommended Stories