వీడియోలు చూపించి మరీ ఆ కంటెస్టెంట్లని ఉతికి ఆరేసిన నాగార్జున.. శ్రీహాన్‌కి ఊహించని ఫనిష్‌మెంట్‌

First Published Nov 5, 2022, 11:30 PM IST

నాగార్జున మరోసారి ఫైర్‌ అయ్యారు. ఈ వారం తప్పుడు చేసిన ఆ కంటెస్టెంట్లపై ఫైర్‌ అయ్యారు. ఇంకా చెప్పాలంటే ఆ నాలుగురిని ఉతికి ఆరేశారు. శనివారం ఎపిసోడ్‌లో అదే హైలైట్‌గా నిలిచింది. 

బిగ్‌ బాస్‌ 6 తెలుగు తొమ్మిది వారాలు పూర్తి చేసుకోబోతుంది. ఇప్పటి వరకు కాస్త రంజుగా, మరికాస్త బోరింగ్‌గా సాగుతూ వస్తోన్న విసయం తెలిసిందే. ఇక వీకెండ్‌ వచ్చిందంటే హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఉంటుంది. తాజాగా శనివారం ఎపిసోడ్‌లో నాగ్ ఎంట్రీ ఎప్పటిలాగే హాట్‌ హాట్ గా సాగింది. ఈ వారం పాటు ఇంటి సభ్యులు చేసిన పొరపాట్లపై మాట్లాడాడు నాగ్‌. ఎవరి తప్పులేంటో చెబుతూ క్లాస్‌ పీకాదు. అయితే కొందరు కంటెస్టెంట్లని మాత్రం ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. 
 

మరోసారి కెప్టెన్‌ అయిన శ్రీ సత్యకి అభినందనలు తెలిపిన నాగ్‌, ఆమె ఆట తీరుని అభినందించారు. విరుచుపడ్డావంటూ కితాబిచ్చారు. ఇక అంతకు ముందు రెడ్‌ టీమ్‌, బ్లూ టీమ్‌లుగా సభ్యులు ఆడిన ఆట తీరుని చర్చిస్తూ, ర్యాంకింగ్ ఇవ్వాలని తెలిపారు. బ్లూ టీమ్ కెప్టెన్‌ ఆదిరెడ్డి తమ గ్రూప్‌ సభ్యులకు ర్యాంకింగ్‌ ఇచ్చాడు. రాజ్‌కి మొదటి ర్యాంక్‌, ఇనయకి రెండు, మెరీనాకి మూడు, వాసంతికి నాలుగు, బాలాదిత్యకి ఐదు, రోహిత్‌కి ఆరు, తనకు ఏడో ర్యాంక్‌ ఇచ్చుకున్నారు. 
 

ఈ క్రమంలో నోరు జారి బూతులు వాడిన బాలాదిత్యకి గట్టిగా క్లాస్‌ పీకాడు నాగ్‌. సిగ్గులేదా, నువ్వు మనిషివేనా, ఇంకా ఆయన ఆవేశంలో అన్న మాటలపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. సిగరేట్‌ కోసం గీతూని అన్నేసి మాటలు అంటావా అంటూ ఫైర్‌ అయ్యాడు. ఈ దెబ్బతో బాలాదిత్య ఇకపై తాను సిగరేట్‌ తాగనని, మానేస్తానని మాటిచ్చాడు. మరోవైపు గీతూని కూడా హెచ్చరించారు. బలహీనతలపై ఆడుకుంటారా? అంటూ మండిపడ్డారు. టీమ్‌ లీడర్‌గా ఆదిరెడ్డి అద్భుతంగా ఆడాడని ప్రశంసించారు నాగ్‌. 
 

రెడ్‌ టీమ్‌ లీడర్‌ గీతూ కూడా తమ సభ్యులకు ర్యాంకింగ్‌ ఇచ్చింది. శ్రీహాన్ కి మొదటి ర్యాంక్‌, ఫైమాకి రెండు, శ్రీసత్యాకి మూడు, రేవంత్‌కి నాలుగు, తనకు ఐదు, కీర్తికి ఆరు ర్యాంకింగ్‌ ఇచ్చారు. శ్రీహాన్‌ ప్రస్తావన వచ్చినప్పుడు నాగ్‌ ఫైర్‌ అయ్యాడు. అతను వరస్ట్ కెప్టెన్‌గా తేల్చాడు. తన నాయకత్వంలో జరిగిన తప్పులను వీడియోలు చూపించి మరీ వెల్లడించారు. నరికేస్తా, పీకేస్తా అన్న శ్రీహాన్‌, అలా చేయలేదని, నరికేస్తా అన్నావ్‌, ఏం నరికినవో చెప్పు అంటూ నిలదీశాడు నాగార్జున. గీతూ చేత బాత్‌ రూమ్‌ క్లీన్ చేయించలేకపోయావని, కెప్టెన్‌గా ఏమాత్రం బాగా చేయలేదని చెప్పారు. అంతేకాదు అతని ప్రవర్తన, తప్పుల కారణంగా వచ్చే వారం కెప్టెన్సీ కంటెండర్‌లో లేకుండా ఫనిష్‌మెంట్‌ ఇచ్చారు నాగ్‌. 

మరోవైపు రేవంత్‌ ప్రస్తావన వచ్చినప్పుడు కూడా ఆయన్ని ఆడుకున్నారు. తన అగ్రెసివ్‌ నెస్‌ని తగ్గించుకోవాలని తెలిపారు. వీడియో చూపించి మరీ ఇనయపై గేమ్‌లో ఆయన ప్రవర్తించిన తీరుని చూపించి నిలదీశాడు. ఇంతటి కోసం సరికాదని ఆయనకు ఎల్లో కార్డ్ ఇచ్చాడు నాగార్జున. ఇది హెచ్చరికగా తెలిపారు. మళ్లీ అలా రిపీట్ కాకూడదని వెల్లడించారు. ఫుడ్‌ విషయంలో వాళ్లు చేసిన మిస్టేక్స్ ని, ఫుడ్‌ కోసం హౌజ్‌లో జరిగే గొడవలను చూపించి వారికి గట్టిగా క్లాస్‌ పీకారు. ఇకపై ఫుడ్‌ వేస్ట్ కాకూడదని వార్నింగ్‌ ఇచ్చారు. 
 

ఈ విషయంలో ఇనయపై ఫైర్‌ అయ్యాడు నాగ్‌. దీనికితోడు శ్రీహాన్‌, శ్రీసత్యలపై ఇనయ చేసిన కామెంట్లని చూపించారు. గేమ్‌లో భాగంగా ఆడుతున్న సమయంలో `నాకు తెలుసు రాత్రిళ్లు నువ్వు ఎక్కడికి వెళ్లి పడుకుంటున్నావో` అంటూ కామెంట్లు చేసింది ఇనయ. దీన్ని కవర్ చేసుకోవాలని చూసింది. కానీ వీడియో చూపించి మరీ తన ఇంటెన్షన్‌ ఏంటో బట్టబయలు చేశాడు నాగ్‌. దీంతో ఆమె ముఖం వాడిపోయింది. ఇంకెప్పుడు ఇలాంటి కామెంట్లు చేయోద్దని, ఎవరూ ఇలా మాట్లాడవద్దని, పర్సనల్‌గా కామెంట్లు చేయోద్దని వార్నింగ్‌ ఇచ్చాడు. 
 

ఇక నామినేషన్ల ప్రక్రియ విషయానికి వస్తే శనివారం రోజు ముగ్గురు సేవ్‌ అయ్యారు. ఫస్ట్ లెవల్ లో ఆదిరెడ్డి సేవ్‌ కాగా, రెండో లెవల్‌లో కీర్తి, రేవంత్‌ సేవ్‌ అయ్యారు. ప్రస్తుతం నామినేషన్ల ఏడుగురు గీతూ, ఫైమా, రోహిత్‌, మెరినా, వాసంతి, బాలాదిత్య, ఇనయ ఉన్నారు. వీరిలో రేపు ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. గీతూ హౌజ్‌ని వీడే అవకాశాలున్నాయని సమాచారం. 

click me!