టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ (Sivaji) కొన్నేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గానే ఉంటున్నారు. నటుడిగా ఎన్నో పాత్రలు పోషించారు. నెగెటివ్ షేడ్స్ లోనూ, నహీరోగానూ నటించి మెప్పించారు. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.
2016 నుంచి శివాజీ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ కొన్ని సినిమాలకు మాత్రం డబ్బింగ్ చెప్పారు. తన వాయిస్ తో ఇప్పటికే పలు సినిమాలు వచ్చి ఆకట్టుకున్నాయి. 25 ఏళ్ల కెరీర్ లో నటుడిగా సాధించలేని ఘనతను శివాజీ తన వాయిస్ తో దక్కించుకున్నాడు.
తన ప్రత్యేకమైన వాయిస్ తో డబ్బింగ్ చెప్పడం ద్వారా శివాజీకి ‘నంది అవార్డు’ దక్కడం విశేషం. ఇటు నటుడిగా సినిమాలు చేస్తూనే అటు పలు సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పారు. తొలుత నితిన్ ‘జయం’ సినిమాకు శివాజీ డబ్బింగ్ చెప్పారు. బాగా సెట్ అవ్వడంతో ఆ తర్వాత ‘దిల్’లోనూ నితిన్ కు వాయిస్ అందించారు శివాజీ.
కాగా, 2003లో బెస్ట్ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా శివాజీకి నంది అవార్డు (Nandi Award) అందింది. స్టేట్ అందించే ఈ అవార్డు కోసం ఆర్టిస్టులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. శివాజీ డబ్బింగ్ ఆర్టిస్ట్ రూపంలో వరించడం విశేషం. మరి కొన్ని సినిమాలకూ డబ్బింగ్ చెప్పారు. సొంతంలో ఆర్యన్ రాజేశ్, సంబరంలో నితిన్ కు, ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’లో యషో సాగర్ కు, ‘పిజ్జా’లో విజయ్ సేతుపతికి తెలుగు వెర్షన్ లో వాయిస్ అందించారు.
ప్రస్తుతం Bigg Boss Telugu 7లో అలరిస్తున్నారు. తన మాటలతో కంటెస్టెంట్లకు భరోసాగానూ, ధీటుగానూ నిలుస్తున్నారు. ముఖ్యంగా ఆయన వాయిస్ ఉన్న పవర్ తో ఏకంగా తోటి ఆటగాళ్లకు దైవంగా మారుతున్నారు. టాప్ 5 కంటెస్టెంట్స్ లో శివాజీని ప్రిడిక్ట్ చేస్తున్నారు. టైటిల్ కూడా కొట్టే అవకాశం లేకపోలేదని అంటున్నారు. తన మాటలతో అందరి నుంచి తనకు పెద్దరికం వచ్చేలా మెదులుతున్నారు.
ఇక శివాజీ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’తో అరిస్తుండగా.. మరో వైపు ఓ వెబ్ సిరీస్ లోనూ నటిస్తున్నట్టు తెలుస్తోంది.ఈటీవీ విన్ ఛానెల్ లో రానున్న 90's సిరీస్ లో మెయిన్ లీడ్ లో అలరించబోతున్నారు.