Thammudu Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో 'తమ్ముడు' చిత్రం ఒక క్లాసిక్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా టైటిల్ వెనుక ఒక ఆసక్తికరమైన కథ సాగింది. మొదట 'సోల్జర్', 'వారియర్' అనే టైటిల్స్ అనుకున్నా, చివరికి 'తమ్ముడు' టైటిల్ కోసం..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'తమ్ముడు' చిత్రం యూత్‌లో ఎలాంటి క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ స్టైల్, మేనరిజమ్స్, పాటలతో అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. పవన్ కెరీర్‌లో క్లాసిక్ హిట్‌గా నిలిచింది.
25
మొదట అనుకున్న టైటిల్స్
అయితే మీకో విషయం తెలుసా.! ఈ సినిమాకు మొదట 'తమ్ముడు' అనే టైటిల్ అనుకోలేదట. ఈ చిత్రానికి ప్రారంభంలో 'సోల్జర్', 'వారియర్' అనే టైటిల్స్‌ను పరిశీలించారట. కానీ, సినిమా కథకు 'తమ్ముడు' అనే పేరు అయితేనే బాగా సెట్ అవుతుందని చిత్ర బృందం భావించింది. అయితే ఈ టైటిల్ కోసం రైట్స్ తీసుకోవడానికి వెళ్తే ఒక షాకింగ్ విషయం తెలిసింది.
35
నాగార్జున సీతారామరాజు కోసం..
'తమ్ముడు' అనే టైటిల్ అప్పటికే కింగ్ నాగార్జున నటిస్తున్న 'సీతారామరాజు' సినిమా కోసం రిజిస్టర్ చేసుకున్నారట. అప్పట్లో ఆ టైటిల్ హక్కులు నాగార్జున వద్ద ఉండటంతో, పవన్ కళ్యాణ్ సినిమా నిర్మాతలు నాగార్జునను సంప్రదించారు. పవన్ సినిమా కథకు ఈ టైటిల్ ఎంతో యాప్ట్‌గా ఉంటుందని, దయచేసి ఆ టైటిల్‌ని వదులుకోవాలని నిర్మాతలు కోరారట.
నిర్మాతల అభ్యర్థనను విన్న నాగార్జున ఏమాత్రం ఆలోచించకుండా, తన సినిమా కోసం అనుకున్న 'తమ్ముడు' టైటిల్‌ను పవన్ కళ్యాణ్ సినిమా కోసం వదులుకున్నారు. పవన్ కళ్యాణ్‌పై ఉన్న గౌరవం, స్నేహంతో నాగార్జున చేసిన ఈ త్యాగం వల్లనే ఆ సినిమాకు 'తమ్ముడు' అనే పవర్‌ఫుల్ టైటిల్ దక్కింది.
55
ఇండస్ట్రీలో పెద్ద చర్చ
నాగార్జున చేసిన ఈ పని అప్పట్లో ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. అలాగే తమ్ముడు సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఒకరినొకరు గౌరవించుకుంటూ, అవసరమైతే తమ టైటిల్స్‌ని కూడా వదులుకునే ఇలాంటి సంప్రదాయం టాలీవుడ్ స్టార్ హీరోల మధ్య ఉన్న స్నేహానికి నిదర్శనమని చెప్పొచ్చు.