Bigg Boss 6 Telugu: చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున.. తీవ్ర ఉత్కంఠకి తెర.. ఆది కోసం గీతూ కన్నీళ్లు..

Published : Oct 30, 2022, 11:15 PM IST

బిగ్‌ బాస్‌ 6 తెలుగు ఎనిమిదో వారంలో ఊహించని ట్విస్టులు అటు కంటెస్టెంట్లని, ఇటు ఆడియెన్స్ ని ఆశ్చర్యానికి, షాక్‌కి గురి చేశాయి. నాగ్‌ చివరి నిమిషంలో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.

PREV
16
Bigg Boss 6 Telugu: చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున.. తీవ్ర ఉత్కంఠకి తెర.. ఆది కోసం గీతూ కన్నీళ్లు..

బిగ్‌ బాస్‌ తెలుగు 6వ(Bigg Boss 6 Telugu) సీజన్‌ ఎనిమిది వారాలు పూర్తి చేసుకుంది. ఎనిమిదో వారంలో ఊహించిన ట్విస్ట్ లిచ్చాడు నాగార్జున(Nagarjuna). ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌ ఉంటుందని చెప్పారు. శనివారం రోజు ఎలిమినేషన్‌ ఉండదు. కానీ ఊహించని విధంగా శనివారం ఆర్జే సూర్య(RJ Surya)ని డైరెక్ట్ గా ఎలిమినేట్‌ చేశారు. అందరికి షాకిచ్చాడు. దీంతో హౌజ్‌ మొత్తం షాక్‌లోకి వెళ్లిపోయింది. అయితే సూర్యని సీక్రెట్‌ రూమ్‌లో ఉంచుతారేమో అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేకుండా ఆదివారం ఎపిసోడ్‌లో స్టేజ్‌పైకి తీసుకొచ్చి రెగ్యూలర్‌ ఎలిమినేషన్ ప్రాసెస్‌ కానిచ్చాడు. 

26

ఆర్జే సూర్యతో `ఫైర్‌`, `ఫ్లవర్‌` ఎవరో చెప్పించారు. దీంతో రేవంత్‌, గీతూ, శ్రీహాన్‌, బాలాదిత్య ఫ్లవర్స్‌ అని, కాకపోతే వాళ్లు కొన్ని మార్చుకోవాలన్నారు. రేవంత్‌ ఆవేశం తగ్గించుకోవాలని, గీతూ తన గేమ్‌ తాను ఆడాలని, శ్రీహాన్‌ క్లారిటీ ఉన్న కంటెస్టెంట్‌ అని, కొన్నిసార్లు హర్ట్ చేసేలా మాట్లాడతాడని, బాలాదిత్య మంచితనం తగ్గించుకోవాలని చెప్పారు. మరోవైపు ఫైరింగ్‌లో ఫైమా ఎటకారం తగ్గించుకోవాలని, ఇనయ గేమ్‌ బాగా ఆడాలని, రాజ్‌ నెగటివ్‌ లేని పర్సన్‌ అని, గట్టిగా తన వాదనని వినిపించాలని, కీర్తి గేమ్‌ పై ఫోకస్‌ పెట్టాలని తెలిపారు. 
 

36

ఈ క్రమంలో ఇనయ, సూర్యల మధ్య లవ్‌ ట్రాక్‌ ఎపిసోడ్‌ కాసేపు రసవత్తరంగా సాగింది. బ్యాడ్జ్, రింగ్‌, డ్రెస్‌ సేమ్‌ వేశామంటూ సూర్యపై తన ప్రేమని తెలియజేసింది ఇనయ. అంతేకాదు రెండు వేళ్లతో హార్ట్ సింబల్ చూపించుకున్నారు. ఇది చూసిన నాగార్జున ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అవన్నీ ఏంటో నాకు అర్థం కావడం లేదని, ఏంటో తెలియనివన్నీ ఇందులో కనిపిస్తున్నాయంటూ సెటైర్లు పేల్చడం నవ్వులు పూయించింది. 

46

సూర్య హౌజ్‌ని వీడిని తర్వాత `లైక్ షేర్‌ సబ్‌ స్క్రైబ్‌` టీమ్‌ ఫరియా అబ్దుల్లా, సంతోష్‌ శోభన్‌ షోలో సందడి చేశారు. తమ సినిమా ప్రమోట్‌ చేసుకుంటూ హౌజ్‌మేట్స్ తో గేమ్‌ ఆడిపించారు. తమ సినిమా గురించి చెప్పారు. ఈ సందర్భంగా ఇంటి సభ్యులతో సాంగ్‌లను గెస్‌ చేసే గేమ్‌ పెట్టాడు నాగ్‌. శ్రీ సత్య `ఏ` టీమ్‌, రేవంత్‌ `బీ` టీమ్‌. పీప్‌ తో సౌండ్‌ చేస్తే దాన్ని బట్టి పాటని గెస్‌ చేసి చెప్పాల్సి ఉంటుంది. ఇది ఆద్యంతం నవ్వులు పూయించింది. ఇందులో బీ రేవంత్‌ టీమ్‌ గెలిచింది. అంతేకాదు ఫరియా కోసం ఓ అద్భుతమైన లవ్‌ సాంగ్‌  మెప్పించాడు రేవంత్‌. 

56

అనంతరం ఈ వారం నామినేషన్‌లో ఉన్న వారిని సేవ్‌ చేసే కార్యక్రమం నడుస్తూనే ఉంది. చివరగా ఆదిరెడ్డి, మెరీనా మిగిలారు. ఆదిరెడ్డి వెళ్లిపోతారని అంతా భావించారు. మెరీనా కూల్‌గానే ఉంది. ఆదిరెడ్డి ఎక్కడ వెళ్లిపోతాడో అని గీతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఫస్ట్ టైమ్‌ ఆమె ఏడవడమనే చెప్పాలి. తాను వెళ్లిపోతే తనని ఎవరు అర్థం చేసుకుంటారని గుక్క పెట్టి ఏడ్చింది గీతూ. 

66

ఇక ఫైనల్‌ ఎలిమినేషన్‌ ప్రక్రియలో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు నాగ్‌. వారిద్దరిని సేవ్‌ చేశారు. దీంతో హౌజ్‌ మొత్తం ఊపిరి పీల్చుకుంది. నాగార్జునకి, బిగ్‌ బాస్‌కి వాళ్లు థ్యాంక్స్ చెప్పారు. అయితే వచ్చే వారం ఇంత స్మూత్‌గా ఉండదని హెచ్చరిస్తూ ఈ ఎపిసోడ్‌ని ముగించాడు నాగ్‌. కానీ చివరిలో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం అందరిని ఆకట్టుకుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories