సామాన్యుడు కోటాలో హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆదిరెడ్డి సత్తా చాటుతున్నాడు. టాప్ సెలెబ్రిటీలను వెనక్కి నెట్టి అతడు టాప్ 5లో చోటు సంపాదించారు. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా సర్వే ఫలితాలు విస్మయ పరుస్తున్నాయి.
బిగ్ బాస్ సీజన్ 6 ఎనిమిది వారాలు పూర్తి చేసుకుంది. అంటే సగం షో ముగిసినట్లే. మరో ఏడెనిమి వారాల షో మిగిలి ఉంది. 21 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన షోలో 13 మంది మిగిలారు. ఈ వారం సూర్య ఎలిమినేట్ కావడం జరిగింది.
27
Bigg Boss Telugu 6
ఇప్పటి వరకు హౌస్ వీడిన కంటెస్టెంట్స్ ని పరిశీలిస్తే... మొదటి వారం ఎలాంటి ఎలిమినేషన్ లేదు. అయితే సెకండ్ వీక్ షాని, అభినయశ్రీలను ఎలిమినేట్ చేశారు. ఇక మూడవ వారం నేహా చౌదరి, నాలుగవ వారం ఆరోహిరావు ఎలిమినేట్ అయ్యారు. చలాకీ చంటి, సుదీప, సూర్య వరుసగా ఇంటిని వీడటం జరిగింది.
37
Bigg Boss Telugu 6
ప్రస్తుతం బిగ్ బాస్ ఇంటిలో రేవంత్, బాల ఆదిత్య, రాజ్, ఫైమా, ఇనయా, శ్రీసత్య, ఆదిరెడ్డి, గీతూ, శ్రీహాన్, వాసంతి, రోహిత్, మెరీనా, కీర్తి ఉన్నారు. వీరిలో కేవలం 5గురు కంటెస్టెంట్స్ ఫైనల్ కి వెళతారు. మిగతా కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతారు.
47
Bigg Boss Telugu 6
ఇక కంటెస్టెంట్స్ మాట తీరు, ఆట తీరు ఆధారంగా ప్రేక్షకులు వాళ్లకు ర్యాంకింగ్స్ ఇస్తున్నారు. ఆడియన్స్ అభిప్రాయం ప్రకారం ఫైనల్ కి వెళ్లే కంటెస్టెంట్స్ ఎవరో తేలిపోయింది.ప్రముఖ బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కంటెస్టెంట్స్ పై సర్వే నిర్వహించడం జరిగింది. అక్టోబర్ 22 వరకు జరిగిన సర్వే రిజల్ట్స్ ప్రకారం టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ గా ఎన్నికైన లిస్ట్ ఇలా ఉంది.
57
Bigg Boss Telugu 6
స్టార్ సింగర్ ఇండియన్ ఐడల్ విజేత రేవంత్ టాప్ లో కొనసాగుతున్నారు. ప్రేక్షకులు ఆయనకు నంబర్ వన్ ర్యాంక్ ఇచ్చారు. సెకండ్ ర్యాంక్ శ్రీహాన్ సొంతం చేసుకున్నారు. శ్రీహాన్ మాటతీరు ఆటతీరు చాలా బాగుందని స్వయంగా ఇంటి సభ్యులు ఒప్పుకున్నారు. ప్రేక్షకులు కూడా అదే ఫీల్ అవుతున్నట్లు సర్వే రిజల్ట్ చెబుతున్నాయి.
67
Bigg Boss Telugu 6
ఇక మూడో ర్యాంక్ శ్రీసత్య, నాలుగో ర్యాంక్ జబర్దస్త్ ఫైమా, ఐదవ ర్యాంక్ ఆదిరెడ్డి దక్కించుకున్నారు. టాప్ ఫైవ్ లో ఉన్నవారిలో ఆదిరెడ్డి సామాన్యుడు కోటాలో హౌస్లోకి వెళ్ళాడు. మిగతా వాళ్లతో పోల్చుకుంటే మనోడికి ఫేమ్ తక్కువ. అయినప్పటికీ షోలో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతానికి ఆదిరెడ్డి టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉన్నారు.
77
Bigg Boss Telugu 6
బాల ఆదిత్య, కీర్తి వంటి సెలెబ్రెటీలకు టాప్ ఫైవ్ లో చోటు దక్కకపోవడం విశేషం. ఇక మొదటివారం నుండి టాప్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న గీతూ కూడా సోదిలో లేదు. గీతూ ప్రవర్తన రానురాను దిగజారుతున్నట్లు అనిపిస్తుంది. దీంతో ప్రేక్షకుల్లో ఆమె పట్ల వ్యతిరేకత పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే రెండు మూడు వారాల్లో గీతూ సర్దుకోవడం ఖాయం.