Nagabandham 3 days Collections: 3 రోజుల్లో నాగబంధం మూవీ వసూలు చేసింది ఇంతేనా.. షాకింగ్‌ కలెక్షన్లు

Published : Jul 06, 2026, 11:06 AM IST

విరాట్‌ కర్ణ, నభా నటేష్‌, ఐశ్వర్య మీనన్‌ హీరోహీరోయిన్లుగా నటించిన `నాగబంధం` మూవీ భారీ అంచనాలతో వచ్చింది. కానీ బాక్సాఫీసు వద్ద సత్తా చాటడంలో వెనకబడింది. మూడు రోజుల్లో ఈ మూవీకి ఎంత కలెక్షన్లు వచ్చాయంటే? 

PREV
13
భారీ బడ్జెట్‌తో నాగబంధం మూవీ

`పెదకాపు` తర్వాత విరాట్‌ కర్ణ నటించిన చిత్రం `నాగబంధం`. ఇది నభా నటేష్‌, ఐశ్వర్య మీనన్‌, అనసూయ, మురళీ శర్మ, జగపతిబాబు, రిషబ్‌ సాన్వీ వంటి భారీ కాస్టింగ్‌తో రూపొందింది. హీరో ఇమేజ్‌కి మించిన బడ్జెట్‌తో రూపొందించారు. దీనికి సుమారు వంద కోట్ల బడ్జెట్‌ అయ్యిందని సమాచారం. కొత్త హీరోపై ఈ స్థాయి బడ్జెట్‌ అంటే చాలా కష్టం. అయితే బిజినెస్‌ కూడా గట్టిగానే చేసింది. నాన్‌ థియేట్రికల్‌ రైట్స్ రూపంలోనే సుమారు రూ.80కోట్లు వచ్చినట్టు సమాచారం. ఈ లెక్కన నిర్మాతకు మరో ఇరవై కోట్లు వస్తే సేఫ్‌లో ఉంటాడు.

23
నాగబంధం మూడు రోజుల కలెక్షన్లు

భారీ అంచనాల మధ్య విడుదలైన `నాగబంధం` మూవీకి మొదటి రోజు నుంచే నెగటివ్‌ టాక్‌ వచ్చింది. విజువల్స్ గా బాగున్నా, కథ పరంగా తేలిపోయిందని, టేకింగ్‌ పరంగా ఆకట్టుకునేలా లేదనే టాక్‌ వచ్చింది. యాక్షన్‌ ఉందిగానీ, ఎమోషన్స్ మిస్‌ అయ్యాయి. దీంతో ఆడియెన్స్ సినిమాకి కనెక్ట్ కాలేకపోయారు. ఆ ప్రభావం ఇప్పుడు కలెక్షన్లపై పడుతుంది. దీనికి పూర్‌ కలెక్షన్లు వస్తుండటం గమనార్హం. మూడు రోజులో  ఈ మూవీ రూ.12.90కోట్లు వసూలు చేసింది.

33
బాక్సాఫీసు వద్ద దారుణమైన వసూళ్లు

మొదటి రోజు ఈ సినిమాకి రూ.3.40కోట్లు వస్తే, రెండో రోజు మూడు కోట్లు మాత్రమే వచ్చాయి. మూడో రోజు రూ.3.65కోట్ల నెట్‌ని రాబట్టింది. ఇలా ఇప్పటి వరకు ఇండియాలో రూ.10.10కోట్లు వసూలు చేయగా, రూ.11.65కోట్ల గ్రాస్‌ వచ్చింది. ఓవర్సీస్‌ కలుపుకొని ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో రూ.12.90కోట్లు రాబట్టినట్టు సాక్నిల్క్ సైట్‌ వెల్లడించింది. ఈ లెక్క ఆరు కోట్ల షేర్‌ మాత్రమే వచ్చిందని చెప్పొచ్చు. ఈ మూవీ గ్రాండియర్‌ నెస్‌కి, హంగామాకి ఇది చాలా తక్కువ అనే చెప్పాలి. సోమవారం నుంచి వచ్చే కలెక్షన్లు ఈ సినిమా భవిష్యత్‌ని, హిట్టా? ఫట్టా అనే విషయాన్ని డిసైడ్‌ చేయబోతున్నాయి. అయితే ఈ మూవీకి థియేట్రికల్‌గా రూ.50-60కోట్ల బిజినెస్‌గా లెక్కకట్టారు. ఈ లెక్కన వంద కోట్లకుపైగానే గ్రాస్‌ రాబట్టాలి. అది సాధ్యం కాదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ మూవీని అభిషేక్‌ పిక్చర్స్, నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories