రోజా బాలయ్య డైలాగ్ కి నాగబాబు ఘాటు సెటైర్... అయితే ఆ లాజిక్ మిస్సయ్యాడు!

First Published Mar 16, 2021, 6:37 PM IST

జబర్దస్త్ వేదికపై నాగబాబు, రోజా లది ఏళ్ల అనుబంధం.  దాదాపు ఏదేళ్లు వీరిద్దరూ జడ్జిలుగా జబర్దస్త్ షోని విజయపథంలో షోని నడిపారు. సమయస్ఫూర్తి, కమెడియన్స్ పంచ్ లకు అనుగుణంగా పంచ్ లు వేసి నవ్వించడం వీరి ప్రత్యేకత.
 

జబర్దస్త్ వేదికపై కలివిడిగా కనిపించే నాగబాబు రోజా మధ్య రాజకీయ విభేదాలు అయితే ఉన్నాయి. నాగబాబు... తమ్ముడు పవన్ స్థాపించిన జనసేన పార్టీలో ఉండగా.. రోజా జగన్ నెలకొల్పిన అధికార వైఎస్ఆర్ పార్టీలో  ఎం ఎల్  ఏ గా కొనసాగుతున్నారు.
undefined
రాజకీయాల పరంగా ఆరోపణలు ప్రత్యారోపణలలో భాగంగా పవన్ ని అనేక మార్లు రోజా విమర్శించారు. అదే విధంగా జగన్ పై, ఆయన  ప్రభుత్వంపై నాగ బాబు ఘాటు వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి.
undefined
నాగబాబు జబర్దస్త్ ని వదిలి ఏడాది దాటిపోయింది. రోజా మాత్రం కొనసాగుతూనే ఉన్నారు. నాగబాబు జబర్దస్త్ కి పోటీగా జీ తెలుగులో అదిరింది, బొమ్మ అదిరింది పేరుతో రెండు కామెడీ షోలు స్టార్ట్ చేసి... సక్సెస్ కాకపోవడంతో వాటిని మూసేశారు.
undefined
ప్రస్తుతం యూట్యూబ్ లో ఖుషీఖుషీగా అనే పేరుతో ఓ స్టాండప్ కామెడీ నిర్వహిస్తున్నాడు. అదేమంత ఆదరణ దక్కించుకున్న సూచనలు కనిపించడం లేదు. తక్కువ బడ్జెట్ కావడంతో కొనసాగిస్తున్నారు.
undefined
అయితే పరోక్షంగా సెటైర్స్ వేయడంలో దిట్టయిన నాగబాబు... తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా గతంలో అనేక మందిని విమర్శించడం జరిగింది. బాలయ్యపై అయితే నాగబాబు వీడియో సిరీస్ లు చేశారు.
undefined
కాగా నాగబాబు సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో ముచ్చటించారు. ఒకప్పటి జబర్ధస్త్ జడ్జిగా నాగబాబును ఓ ఫ్యాన్... జబర్ధస్త్ లో మీకు ఇష్టమైన కమెడియన్ ఎవరని అడిగారు.  దానికి నాగబాబు సమాధానంగా రోజా అంటూ ఆన్సర్ ఇచ్చాడు.
undefined
జడ్జి రోజాను ఆయన కమెడియన్ అంటూ చెప్పడం ఆమెను అవమానించడమే అని కొందరు అంటున్నారు. రోజాపై అక్కసుతోనే నాగబాబు ఈ కామెంట్ చేశారన్న మాట వినిపిస్తుంది.
undefined
మున్సిపల్స్ ఎన్నికల తరువాత రోజా భారీ భారీ డైలాగ్స్ కొట్టారు. పార్టీ ఏదైనా వైసీపీకి ఎదురొస్తే తొక్కిపడేస్తాం అని బాలయ్య డైలాగ్ కొట్టారు. ఈ డైలాగ్స్ జనసేన నాయకుడైన నాగబాబును హర్ట్ చేసి ఉండవచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు.
undefined
అయితే జడ్జి రోజా జబర్దస్త్ కమెడియన్ అయితే, అదే సీటులో ఏడేళ్లు కూర్చున్న నాగబాబు కూడా కమెడియన్ క్రిందే లెక్క.. కామెంట్ చేసేటప్పుడు నాగబాబు ఈ లాజిక్ మిస్సయ్యాడని కొందరు వాపోతున్నారు.
undefined
click me!