ఈరోజు ఎపిసోడ్ లో తులసి సామ్రాట్ గృహిణి గొప్ప అంతే లేదు భర్త గొప్ప అంటూ వాదించుకుంటూ ఉంటారు. అప్పుడు సామ్రాట్ నేను ఫారెన్ లో బిజినెస్ మేనేజ్మెంట్ చదివాను అని అనగా, వెంటనే తులసి మీది పుస్తకాలు చదివిన అనుభవం నాది జీవితాన్ని చదివిన అనుభవం అని అంటుంది. ఎంత కరెక్టుగా ప్లాన్ వేసుకున్న మధ్యలో తుఫాన్ లాగా వచ్చే ఖర్చులు మొత్తం తుడిచిపెట్టుకుపోతాయి అని అంటుంది తులసి. నేను ఉన్నంతలోనే డబ్బులు ఖర్చు పెడతాను మిగిలినవి సేవింగ్ చేసుకుంటాను అని అనగా ఇలా సాధ్యమండి అని అనడంతో చదువుకున్న వారికి చదువు లేని వారికి ఉన్న డిఫరెంట్ అది అని అంటుంది తులసి.