వైజాగ్ వేదికగా తండేల్ చిత్ర ట్రైలర్ ని మంగళవారం రోజు లాంచ్ చేశారు. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సముద్రంలో జరిగే యాక్షన్ సీన్స్, చైతు, సాయి పల్లవి కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చైతు చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ చైతు తండేల్ చిత్రంతో ముడిపెట్టారు.