సమంతకు విడాకులు ఇచ్చిన తరువాత శోభిత ప్రేమలో పడ్డాడు చైతూ.. అయితే ఈ ప్రేమను రహస్యంగా ఉంచలేకపోయాడు. ఓ నెండుమూడేళ్ళు ప్రేమించుకున్నాక..పెద్దలను ఒప్పించి రీసెంట్ గా డిసెంబర్ 4న పెళ్ళి చేసుకున్నరు ఈ ప్రేమ పక్షులు. వీరి ప్రేమ పెళ్లీ.. అంతా అక్కినేని ప్యాన్స్ కు ఇంకా కలలానేఉంది. అయితే తాజాగా వీరి ప్రేమ, పెళ్ళికి సబంధించిన విషయాలలో క్లారిటీ ఇచ్చారు కొత్త జంట.
Naga Chaitanya-Sobhita Dhulipala
తాజా ఇంటర్వ్యూలో అభిమానులో పాటు, ఆడియన్స్ అందరికి ఉన్న అనుమానాలు చాలా వరకూ క్లియర్ చేశారు.అంతే కాదు గత పెళ్ళి తాలూకు ప్రభావం పడకుండా ఈసారి ఏం జాగ్రత్తలు తీసుకున్నారో కూడా జనాలకు ఓ క్లారిటీ అయితే వచ్చింది. మరీ ముక్యంగా నాగచైతన్య కండీషన్లు విషయంలో కూడా ఓపెన్ అయ్యాడు. ఇంతకీ అంతలా శోభితకు ఏం రూల్స్ పెట్టారు. ఈ విషయంలో చైతూ ఏమంటున్నాడంటే...?
Naga Chaitanya
సమంత ను పెళ్ళాడిన తరువాత అక్కినేనిఫ్యాన్స్ కొన్నివిషయాల్లో పెదవి విరిచారు. మరీ ముఖ్యంగా ఫోటో షూట్ల, హాట్ హాట్ ఫోజులు.. కాని సమంతో విడాకులు తరువాత మళ్ళీ అదే బ్యాక్ గ్రౌండ్ ఉన్న శోభితను చేసుకోవడంతో అంతా ఆశ్చర్యపోయారు.
అయితే నాగచైతన్య శోభికతకు ఓ కండీషన్ పెట్టాడట. ఏం కడీషన్ పెట్టి ఉంటాడు అని అనుకున్నప్పుడు జనాలు అంతా ఖచ్చితంగా హాట్ ఫోటో షూట్స్ గురించే అనుకుని ఉంటారు. కాని చైతూ.. కండీషన్ కమ్ రిక్వెస్ట్అది కాదట.
మరేది అయ్యి ఉంటుందో తెలుసా.. ఏం లేదు నాగచైతన్య పుట్టి పెరిగింది అంతా చెన్నైలోనే.. దాంతో ఆయనకు తమిళ్ ఫ్యూయంట్ గా వచ్చు, చదివింది ఇంగ్లీష్ మీడియం కావడంతో.. తెలుగు మీద అంత గ్రిప్ లేదంట. పెద్ద పెద్ద పదాలు గట్టిగా మాట్లాడలేడట. దాంతో అచ్చతెలుగు తెనాలి అమ్మాయి అయిన శోభితను ఇంట్లో తనతో కంప్లీట్ గా తెలుగులోనే మాట్లాడమనిచెప్పాడట చైతు.
Naga Chaitanya
అక్కినేనిఫ్యామిలీలో మరీ ముఖ్యంగా నాగార్జున ఫ్యామిలీ తెలుగు మాట్లాడటం చాలా తక్కువ. ఇంట్లో అమల తెలుగు కాదు, దాంతో అమలా, అఖిల్, నాగ్ ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారట. చైతూ కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు.
దాంతో వారింటో తెలుగు తక్కువయ్యింది. ఇక చైతూ ఇలా శోభిత దగ్గర తెలుగునేర్చుకుంటున్నాడని తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం నాగచైతన్య తండేల్ మూవీలో నటిస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.
చైతూ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమాతో సక్సెస్ అయితే.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. పిబ్రవరి7 2025 లో ఈసినిమాను రిలీజ్ చేయడం కోసం చూస్తున్నారు. డేట్ అనౌస్స్ చేశారు కూడా. ఈసినిమాలో చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు నాగచైతన్య. పక్కా మాస్ పాత్రలో నటించడానికి ఏడాది పాటు రిసెర్చ్ కూడా చేశాడు. మరి చైతూ కష్టానికి ఫలితం ఎలా వస్తుందో చూడాలి.