ఆమె పరోక్షంగా నాగార్జున ఫ్యామిలీపై తీవ్ర ఆరోపణలు చేశారు. సమంత తల్లి కావాలని ఆశపడ్డారని, ఆమె సంపాదన కోసం అది జరగనీయలేదని, సమంతను సంపాదించే మెషిన్ గా వాడుకున్నారని, కోట్లు సంపాదించే సమంతకు కేవలం వేలల్లో ప్యాకెట్ మనీ ఇచ్చేవారని, అన్నారు. సమంత చాలా మంచి అమ్మాయి అంటూ సర్టిఫై చేసిన మాధవీలత, ఆమె ఖచ్చితంగా ఏ తప్పు చేసి ఉండదని విశ్వాసం వ్యక్తం చేశారు.